ఏజ్ తో సంబంధం లేకుండా  జెట్ స్పీడ్ తో  సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు  సూపర్ స్టార్ రజినీకాంత్.  అందులో భాగంగా ఈఏడాది సంక్రాంతి కి పేటతో ప్రేక్షకులముందుకు రాగ ఈ చిత్రం  మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత  రజినీ, దర్బార్  అనే చిత్రం లో నటించాడు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో వున్న ఈచిత్రం వచ్చే ఏడాది  సంక్రాంతికి విడుదలకానుంది.  రజినీ-మురగదాస్  కాంబినేషన్ లో వస్తున్న  మొదటి సినిమా  కావడంతో దర్బార్ పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రంలో రజినీ ,పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా  ఆయనకు జోడిగా నయనతార నటించింది.  ఇక వీరితో  పాటు బాలీవుడ్ ప్రముఖ నటులు సునీల్ శెట్టి , ప్రతీక్ బబ్బర్ , దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.  తాజాగా విడుదలైన ఈచిత్రం యొక్క ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. 
 
 
ఈ చిత్రం తరువాత  సూపర్ స్టార్ రజినీకాంత్ , మాస్ డైరెక్టర్  శివ డైరెక్షన్ లో తన 168వ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  ఇక ఈరోజు ఈ చిత్రం యొక్క షూటింగ్  రామోజీఫిలిం సిటీ లో ప్రారంభమైంది.  యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో   ట్యాలెంటెడ్ బ్యూటీ కీర్తి సురేష్ , మీనా , కుష్బూ , ప్రకాష్ రాజ్ వంటి భారీ స్టార్ క్యాస్టింగ్ నటిస్తుండగా ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.  సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం  వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.  . 
 

మరింత సమాచారం తెలుసుకోండి: