నందమూరి మూడో తరం నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ పేరు పుణికిపుచ్చుకుని.. నట వారసత్వంలో ఆయన అడుగు జాడల్లో దూసుకుపోతున్నాడీ జూనియ‌ర్ ఎన్టీఆర్. ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్‌లో వరుస హిట్లతో తన సత్తా చూపెడుతున్నాడు. ఇక గ‌త కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో  జోరుగా వినపడుతున్న పేరు జూనియ‌ర్ ఎన్టీఆర్. సినిమాల్లో బిజీగా గడుపుతున్న ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అటు వైసీపీ.. ఇటు టీడీపీ.. ఎన్టీఆర్ రాజకీయ పున:ప్రవేశంపై తమకు తోచినట్లు మాట్లాడుతున్నారు. 

 

అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం చవిచూసినప్పటి నుంచి జూ.ఎన్టీఆర్ నామస్మరణం మొదలయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ తిరిగి పురోగతి సాధించాలంటే తారక్ రంగంలోకి దిగాల్సిందేనని.. అతని వల్లే ఆ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని విస్తృతస్థాయిలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. ఎన్టీఆర్ తో అటు చంద్రబాబుకు కు తన వారసుడు లోకేష్ కు ఇబ్బంది అవుతుందేమోనన్న టెన్షన్.. ఇటు బాలయ్యకు సినిమాల పరంగా ఎన్టీఆర్ నుంచి తనతో పాటు తన వారసుడు మోక్షజ్ఞ కు ఎక్కడ ఎఫెక్ట్ ఉంటుందో అన్న భయం ప‌ట్టుకుంది.

 

ఈ క్ర‌మంలోనే ప్ర‌తిసారి తార‌క్‌ను తొక్కాల‌ని చూస్తే చివ‌ర‌కు బాల‌య్య‌కు అభిమానులు లేకుండా పోతున్నారు. మ‌రోవైపు ఎన్టీఆర్ మాత్రం అంత‌కంత‌కు రైజ్ అవుతున్నాడు. వాస్త‌వానికి 2009లో ఎన్టీఆర్ ప్రచారం చేయగా.. అతడికి ప్రజలు జేజేలు పలికారు. తాతకు తగ్గ మనవడిగా.. ఆయనంతటి వాక్పటిమ ఉండటం పార్టీకి కలిసి వస్తుందన్న అభిప్రాయం ఉంది. కానీ.. చంద్ర‌బాబు, బాల‌య్య మాత్రం ఎన్టీఆర్‌ను ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌లేదు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ దెబ్బ‌కు.. నంద‌మూరి అభిమానుల్లో బాల‌య్య‌కు అభిమానులు త‌గ్గిపోతున్నారు. వాళ్ళంతా ఎన్టీఆర్ అభిమానులుగా మారిపోవ‌డం విశేషం. ఇక బాలయ్య రోజురోజుకూ పార్టీ పరమైన అభిమానులకు పరిమితం అవుతుంటే.. ఎన్టీఆర్ మాత్రం పార్టీలు.. కులాల తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: