టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోగా కొనసాగారు. అదే ఊపులో ఆయన రాజకీయాల్లో ప్రవేశించి సంచలన విజయాలు నమోదు చేసారు. ఆతర్వాత సూపర్ స్టార్ కృష్ణ కూడా కొన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఆయన సత్తా చూపెట్టారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ సింహాసాన్ని ఓ చక్రవర్తిలా ఏలారు.  ఐతే చిరంజీవి తర్వాత ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరో ఎవరు అన్న దానిపై తాజాగా గూగుల్ మరియు సోషల్ మీడియాలో మహేష్ బాబు నెంబర్ అని తేల్చింది. గూగుల్‌లో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా సెర్చ్ చేసిన వ్యక్తుల్లో మహేష్ బాబు నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచాడు. 

 

టాలీవుడ్ లో ఘట్టమనేని ఫ్యామిలీ 50 సంవత్సరాల చరిత్ర అ 50 సంవత్సరాల నుంచి ఒక కుటుంబం రెండు మూడు తరాలుగా అభిమానుల మనసులను గెలుచుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈరోజు ఎంతోమంది టాలీవుడ్ వార్తలు తమ తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని కంటిన్యూ చేయలేక బొక్క బోర్లా పడుతున్నారు కానీ మహేష్ మాత్రం తండ్రికి తగ్గ సరిసమానమైన ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు


తండ్రి కృష్ణ నాటి సూపర్ స్టార్ అయితే తనయుడు మహేష్ నేటి సూపర్ స్టార్ అయ్యాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అనగానే థియేటర్లలో అభిమానులు వేలం వెర్రి తో సినిమా చూసేందుకు ఎగబడతారు. 


 హీరో కృష్ణ‌కి కాని మ‌హేష్‌బాబుకి కాని కులాలు లేవు మతాలు లేవు క్లాసు లేదు మాస్ లేదు అన్ని వ‌ర్గాల వారు ఫ్యాన్స్ అనే చెప్పాలి.  ఆ త‌రం నుంచి ఈ త‌రం వ‌ర‌కు అందరిలోనూ మహేష్ సినిమాలంటే చూడాల్సిందే అన్నట్టుగా ఉంటుంది.

 

 అందుకే మహేష్ పేరు చెబితే ప్రతి ఒక్కరిలోనూ ఎక్కడా లేని ఆసక్తి క్రియేట్ అవుతుంది. ఆయ‌న పేరులోనే ఓ వైబ్రేష‌న్ ఉంటుంది. అంతే కాదు మ‌హేష్ అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. చాలామంది తమకు ఇలాంటి అంద‌మైన‌ కొడుకు ఉంటే బాగుండు అని ఊహించుకుంటారు.ప్రతి తల్లి తండ్రి సైతం మహేష్ లాంటి ఇంత‌ అందమైన నా మంచి మనసున్న కొడుకు కావాలని కోరుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: