ప్రభాస్ ను చూస్తే ఒక ఉప్పెనను చూసినట్లుగా ఉంటుంది. ఆ నవ్వు ముఖం నిండారా ఎప్పుడు  ఆకాశంలోని చందమామాల వెలిగిపోతుంటే మన పక్కింటి అబ్బాయి ఇలాగే ఉంటాడు అనేలా సింపుల్ గా ఉంటాడు. ఇకపోతే సినిమాల్లోకి రాక ముందు ప్రభాస్ అనే పేరు ఎప్పుడు వినిపించించలేదు. ఎక్కడ కూడా ప్రభాస్ కనిపించలేదు. ఎప్పుడైతే ఈశ్వర్ అనే సినిమా మొదలైందో ఆ సమయంలో కృష్ణం రాజు గారి సోదరుని కొడుకుగా అందరికి సుపరిచితుడు అయ్యాడు.. ఇక ఇతని అసలు పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. అభిమానులు ముద్దుగా "ప్రభాస్" అని డార్లింగ్ అని పిలుచుకుంటారు..

 

 

ఇకపోతే ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలివంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచు కున్నాడు. ఇక ప్రభాస్ కెరియర్ ను మలుపు తిప్పింది రెండో సినిమానే ఆ సినిమా పేరు వర్షం. త్రిషాతో చేసిన ఈ సినిమా భారి హిట్ అందుకున్నదనే చెప్పవచ్చూ. ఇకపోతే రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ మూవీతో సినీరంగ ప్రవేశం చేసి ఫస్ట్ సినిమాతోనే విమర్శకుల ప్రశంశలు అందుకున్నారు. దాని తర్వాత ఛత్రపతి మూవీ ప్రభాస్ అంటే ఏంటో అతని స్టామినా ఏంటో ప్రేక్షక లోకానికి పరిచయం చేసింది..

 

 

ఇకపోతే ప్రపంచం మొత్తం గర్వంచబడిన బాహుబలి సినిమా తో ప్రభాస్ స్థాయి ఎక్కడికో ఎదిగి పోయింది.. ఇక ఇప్పటి వరకు ప్రభాస్ కెరీర్ లో మొత్తం 19 సినిమాల్లో నటించాగా వాటిలో టాప్ 10 మూవీస్ ఉండటం విశేషం. ఇకపోతే బాహుబలి తర్వాత వచ్చిన సాహో కాస్త నిరాశ పరిచినా ప్రభాస్ కెరియర్ కు గాని అతని ఇమేజ్ కు గాని వచ్చిన డ్యామేజ్ ఏం లేదనిపిస్తుంది. ఎందుకంటే సింహం అడవిలో ఉన్న, బోనులో ఉన్న అది సింహంలాగే ఉంటుంది కాని పిల్లిలా మారదు. ఇప్పుడు ప్రభాస్ అభిమానులు ప్రభాస్‌ను కూడా అలాగే భావిస్తున్నారు.. అందుకే సినిమా హిట్టైనా  ఫ్లాపైనా ప్రభాస్ రాజు క్రేజ్ తగ్గదంతే అని అనుకుంటున్నారు అభిమానులు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: