తెలుగు సినిమా పరిశ్రమలో వారసత్వంగా వచ్చిన సినిమా నటుల్లో ప్రభాస్ కూడా ఉన్నాడు. పెదనాన్న కృష్ణంరాజు ఆశీర్వాదంతో సినిమాల్లోకి వచ్చి ఓన్ చరిష్మాతో టాలీవుడ్ లో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. భారీ అభిమానగణంతో పాటు మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. సినిమా.. సినిమాకి క్రేజ్ పెంచుకుని ఇప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్ వంద కోట్లు చాలా చిన్న మొత్తం అని చెప్పాలి.

 

 

ఇదంతా ఓవర్ నైట్ లో వచ్చిన స్టార్ డం కాదు. సినిమా.. సినిమాకు పరిణితి చెందుతూ తన నటనకు సానబెట్టుకుంటూ వస్తున్నాడు. ఓ నటుడు రెండు సినిమాల కోసం ఐదేళ్లు కేటాయించటామంటే మాటలు కాదు. ఆ సినిమా ఏమాత్రం అటు ఇటు అయితే కెరీర్ పది సినిమాల వెనక్కి వెళ్లిపోవడం ఖాయం. కానీ దర్శకుడు రాజమౌళి, సినిమా కథపై ఉన్న  నమ్మకమే ప్రభాస్ ను ఇంత డేరింగ్ డెసిషన్ తీసుకునేలా చేసింది. కానీ రాజమౌళి మేకింగ్ పై ప్రభాస్ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా భారీ హిట్ అయి ప్రభాస్ ను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. ఇది తెలుగు సినిమాకు గర్వకారణంగా చెప్పుకోవాలి. దేశంలో తెలుగు సినిమా పరిశ్రమ రెండో స్థానంలో ఉంది. ఖర్చు, రాబడి, సినిమాల కౌంట్ పరంగా బాలీవుడ్ తర్వాత టాలీవుడ్ దే అగ్రస్థానం.

 

 

ప్రభాస్ ను ఈరోజు ఎవరూ కృష్ణంరాజు నట వారసుడు అని అనలేరు. సొంతంగా తెచ్చుకున్న క్రేజ్, స్టార్ డమ్, కథల ఎంపిక, బడ్జెట్, రెమ్యూనరేషన్.. ఇవన్నీ తన క్యాలిబర్ తోనే సంపాదించుకున్నాడు. సినిమాల్లో కష్టపడి నటించడం వేరు.. క్రేజ్ తెచ్చుకోవడం వేరు. ఈ సాధనలో ప్రభాస్ సఫలీకృతం అయ్యాడనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలన్నీ  దేశవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. సాహో సినిమా తెలుగు కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ కలెక్షన్లు సాధించడం పెరిగిన ప్రభాస్ క్రేజ్ కు నిదర్శనం.

మరింత సమాచారం తెలుసుకోండి: