రాజకీయ రంగమైన సినిమా రంగమైన నందమూరి కుటుంబ విషయానికొస్తే జూనియర్ ఎన్టీఆర్ జపం చేయాల్సిందే. ముందుగా రాజకీయ రంగం విషయానికొస్తే 2019 ఎన్నికల సమయంలో ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొంటున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్దలు ప్రచారం ప్రజలలో చేస్తున్న సందర్భంలో చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఎన్నికల ప్రచారానికి రాలేదు ఆయన ఏమయ్యాడు అసలు తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఉందా లేదా ..? సామాన్య ప్రజల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాకా చాలా మంది ప్రశ్నించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉండే మహామహులు ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అన్న విషయం వివరణ ఇచ్చేదాకా ప్రజలు గాని మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గాని శాంతించలేదు.

 

మరి ఇదే విధంగా సినిమా ఇండస్ట్రీలో కూడా నందమూరి కుటుంబ ప్రస్తావన వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జపం నందమూరి అభిమానులు చేస్తుంటారు. కుటుంబం మొత్తం ఒకచోట ఉన్నప్పుడు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వాళ్లలో లేనప్పుడు ఆ సమయంలో అతడు ఎందుకు రాలేదు అని కచ్చితంగా ప్రశ్నలు వేస్తుంటారు నందమూరి అభిమానులు. దీంతో ఆ కార్యక్రమానికి సంబంధించి వేడుక చేస్తున్నా నందమూరి ఇంటి సభ్యులు వివరణ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

 

ఇలా ఏ రంగమైనా వాడు వీడు అని లేదు నందమూరి కుటుంబం ప్రస్తావన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుండి నందమూరి అభిమాని దాక ప్రతి ఒక్కలు నందమూరి కుటుంబానికి సంబంధించి రాజకీయ నాయకుడైన సినిమా హీరో అయినా అంతగా ప్రభావితం చేసిన నందమూరి వంశంలో ప్రస్తుతం ఎవరైనా ఉన్నారు అంటే అది జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.  ఇప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ నాటినుండి ఉన్న నాయకులు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో పని చేయాలని ప్రస్తుత పరిణామాలు బట్టి పార్టీ బతకాలంటే జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం టీడీపీకి అవసరమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: