డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.  రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెరంగ్రేటం చేసిన ప్రభాస్, ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది.  ఈ సినిమా తరువాత రాఘవేంద్ర చేశారు.  అది కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.  ఆ తరువాత చేసిన వర్షం సినిమా భారీ హిట్ అయ్యింది.  ఈ సినిమాలో ప్రభాస్ నటవిశ్వరూపం చూపించారు. వర్షం సినిమాతో ప్రభాస్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.  


అప్పటిలో తెలుగు ఇండస్ట్రీలో వర్షం సినిమా ఒక రేంజ్ లో హిట్ కొట్టింది.  తరువాత చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి.  ఫ్యామిలీ ఆడియన్స్ ను డార్లింగ్ గా, మిస్టర్ పర్ఫెక్ట్ గా ఆకట్టుకున్నాడు.  ఫ్యామిలీ సినిమాతో పాటు మాస్ ను మెప్పించేందుకు భిల్లా, ఛత్రపతి వంటి సినిమాలతో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.  


ఈ మిర్చి వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటెర్టైర్ తో ప్రభాస్ ఒక రేంజ్ లో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా విజయం సాధించడంతో నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తారో అనుకున్నారు.  కానీ, అందరి అంచలనను తలక్రిందులు చేస్తూ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా అనౌన్స్ చేశారు.  మొదటిరోజు షూటింగ్ కర్నూలులో ప్రారంభం అయ్యింది.  యుద్దానికి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేసారు.  


ఇందులో ప్రభాస్ శరీర సౌష్టం పెంచి నిజమైన గ్రీకు యోధుడిగా మారిపోయారు.  ఆరడుగుల ఎత్తు దానికి తగ్గట్టుగా రూపం.. బలిష్టమైన శరీర సౌష్టవంతో ప్రభాస్ ను తెరపై చూసిన విధానం వావ్ అనిపించారు.  బాహుబలి రెండు సీరియస్ లు అద్భుతమైన విజయం సాధించాయి. దీని తరువాత చేసిన సాహో సినిమా సైతం మంచి విజయం సాధించింది.  ఇక భీమవరం ప్రజలు ప్రభాస్ ను చూసి షాక్ అవుతున్నారు.  భీమవరానికి ప్రభాస్ మంచి పేరు తీసుకొచ్చారని అంటున్నారు ప్రజలు.                       

మరింత సమాచారం తెలుసుకోండి: