సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్ని సంవత్సరాలుగా కమర్షియల్ గా విజయం సాధించే సందేశాత్మక, సమాజ హితం కోరే సినిమాల్లో నటిస్తున్నాడు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సందేశాత్మక చిత్రాలు కమర్షియల్ హిట్లు కావటం కష్టమని చాలా మంది నమ్ముతారు. కానీ మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాలు సమాజ హితం కోరే సినిమాలతో కూడా కమర్షియల్ హిట్లను సాధించవచ్చని ప్రూవ్ చేశాయి. 
 
గ్రామ దత్తత కాన్సెప్ట్ తో తెరకెక్కిన శ్రీమంతుడు 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది. విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఈ సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీలు కూడా ఊళ్లను దత్తత తీసుకున్నారు. భరత్ అనే నేను సినిమాతో మహేష్ బాబు సీఎం పాత్రలో నటించి రాష్ట్రంలోని సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించే పాత్రలో నటించాడు. 
 
వర్తమాన కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను హైలెట్ చేస్తూ రాజకీయాలంటే ఏంటో తెలియని యువకుడు ఎనిమిది నెలల్లో ఎన్నో సేవలు చేస్తే రాజకీయాల్లో పండిపోయిన నేతలు ఇంకెంత మంచి చేయొచ్చనే ఆలోచనను మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో రేకెత్తించాడు. మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కిన మహర్షి కూడా కమర్షియల్ హంగులతో పాటు సమాజ హితం కోరే సందేశాత్మక చిత్రంగా తెరకెక్కింది. 
 
మహర్షి సినిమాలో మహేష్ బాబు రైతుల విలువ తెలియజేస్తూ ప్రేక్షకుడి దృష్టిలో మంచి ఆలోచన రేకెత్తించాడు. ఈ సినిమా విడుదలైన తరువాత చాలామంది ఈ సినిమా స్పూర్తితో వీకెండ్ వ్యవసాయం చేయటం పట్ల ఆసక్తి చూపటం గమనార్హం. ఘట్టమనేని ఫ్యాన్స్ సమాజ హితం కోరే సందేశాత్మక చిత్రాల్లో నటించి కమర్షియల్ హిట్లను సాధించటం కేవలం మహేష్ బాబుకు మాత్రమే సాధ్యమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: