రాజకీయ రంగంలో మరియు సినిమారంగంలో వారసుల పర్వం ప్రస్తుతం కొనసాగుతోంది. రాజకీయరంగంలో తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని అందిపుచ్చుకొని వైయస్ జగన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు అనేక పోరాటాలు చేసి రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇక సినిమా రంగంలో అయితే చాలామంది ఇప్పటికే హీరోలు తమ తండ్రి పేరు చెప్పుకొని వారసులుగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు తమ ఖాతాలో వేసుకుంటు అభిమానులను అలరిస్తున్నారు. ఎంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసులుగా ఎంట్రీ ఇచ్చిన తాత ఎన్టీఆర్ వారసత్వంలో తారక్ మరియు తండ్రి వారసత్వం లో మహేష్ అలాగే పెదనాన్న వారసత్వంలో ప్రభాస్ వీళ్ళకి వచ్చిన పేరు మిగతా వారసులకు రాలేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

 

ముందుగా తాత వారసత్వాన్ని అందిపుచ్చుకుని జూనియర్ ఎన్టీఆర్ అయితే ప్రస్తుతం మంచి జోరుమీద ఉన్నాడు. వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గత కొన్ని సంవత్సరాల నుండి రికార్డు స్థాయి కలెక్షన్లు అందిపుచ్చుకుని ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'RRR' సినిమాలో నటిస్తున్నాడు. ఇక మహేష్ విషయానికి వస్తే తండ్రి కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీలో పురుష బ్లాక్బస్టర్ విజయాలు సాధిస్తూ టాలీవుడ్ సింహాసనం పై కూర్చోడానికి రెడీ అన్నట్టుగా కెరియర్ సక్సెస్ ఫుల్ జర్నీలో కొనసాగిస్తూ తాజాగా నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టాడు.

 

ప్రభాస్ విషయానికి వస్తే పెద్దనాన్న కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకుని అద్భుతంగా యంగ్ రెబల్ స్టార్ గా ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో బాహుబలి సినిమా తో పాపులర్ పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు ప్రభాస్. మొత్తం మీద ఈ ముగ్గురు హీరోలు వారసత్వంగా వచ్చి ఇండస్ట్రీలో ఏ హీరో సాధించలేని విజయాలు సాధిస్తూ కెరియర్ ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: