మంచి అంచనాల మధ్య  గత శుక్రవారం సోలోగా విడుదలైన చిత్రం వెంకీ మామ.  విక్టరీ వెంకటేశ్ ,యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన ఈ చిత్రం మిక్సడ్ రివ్యూస్ ను రాబట్టుకొంది అయితే  రివ్యూస్ తో సంబంధం లేకుండా   ఈ చిత్రం  మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా  45కోట్ల  గ్రాస్ వసూళ్లను రాబట్టి  వెంకీ , చైతన్య కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది.  ఇక  తెలుగు రాష్ట్రాల్లో  ఈ చిత్రం  16కోట్ల  షేర్ ను రాబట్టి  ప్రీ రిలీజ్ బిజినెస్ లో 65శాతం వెనక్కు తెచ్చింది. 
 
అయితే  సోమవారం నుండి ఈ చిత్రానికి  కష్టాలు స్టార్ట్ అయ్యాయి.  మొదటి మూడు  రోజులు హావ కొనసాగించిన వెంకీ మామ నాల్గువ రోజు  నెమ్మదించింది. దాంతో కేవలం 2.70కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది.  ఓ రకంగా చూస్తే  ఇది డీసెంట్ వసూళ్లనే చెప్పొచ్చు.  అయితే ఐదవ రోజైతే  మరి  దారుణంగా 1.30కోట్ల షేర్ ను మాత్రమే  కలెక్ట్ చేసింది. దాంతో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో  20కోట్ల షేర్ ను  రాబట్ట గలిగింది.  ఇంకో  6 కోట్లు తెస్తేనే కానీ  బయ్యర్లు  సేఫ్ అవ్వరు. ఇదే రన్ ను కొనసాగించినా  ఫుల్ రన్ లో 6కోట్లు రాబట్టడం పెద్ద  కష్టం కాకపోవచ్చు కానీ  ఈశుక్రవారం  ఏకంగా నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి.  దాంతో వెంకీ మామ కు కలెక్షన్స్  రావడం  కష్టమే అయ్యేలాగే  వుంది.
 
మరి  ఈచిత్రం రానున్న రోజుల్లో  పుంజుకొని మిగితా మొత్తాన్ని రాబడుతుందో లేదా చేతులెత్తేస్తుందో చూడాలి.  బాబీ డైరెక్షన్ లో   పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కిన  ఈ చిత్రంలో  వెంకీ సరసన  హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించగా   నాగ చైతన్య కు  జోడిగా  రాశీ ఖన్నానటించింది.   సురేష్  ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై  సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్  సంయుక్తంగా నిర్మించిన  ఈచిత్రానికి తమన్ సంగీతం అందించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: