యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. తను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండటానికి ప్రధాన కారకుడు హరికృష్ణ. కళ్యాణ్ రామ్ తో సమానంగా తారక్ ను చూడటం జరిగింది. ఇక పెద్దాయన నందమూరి తారక రామారావుకి అయితే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం.

 

నందమూరి నట వారసత్వం కొనసాగిస్తూ తెలుగులో టాప్ రేంజ్ హీరోగా ఎదిగాడు తారక్. తనకు ఇంతటి గొప్ప జీవితం ఇచ్చిన తండ్రి మీద ఎప్పుడు ప్రేమ చూపిస్తూనే ఉంటాడు తారక్. అమ్మ దగ్గర ఉన్నా సరే నాన్న అంటేనే తారక్ కు బాగా ఇష్టం. తారక్ చేసిన నాన్నకు ప్రేమతో సినిమా చూసి హరికృష్ణ చాలా సంతోష పడ్డారట.

 

ఇక అరవింద సమేత సినిమా టైంలో హరికృష్ణ మరణం తారక్ ను శోక సముద్రంలో పడేసింది. ప్రతి కొడుకు తన తండ్రిని ప్రేమించిన దాని కన్నా ఎక్కువగా తారక్ హరికృష్ణని ప్రేమించారు.

 

అందుకే తన ప్రతి సినిమా వేడుకలో పెద్దాయనను.. తండ్రిని గుర్తు చేసుకుంటాడు. తండ్రిని మాత్రమే కాదు రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన అన్న జానకి రామ్ ని కూడా సమయం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుంటారు తారక్.

 

చిన్న వయసులోనే జీవితం నేర్పిన పాఠాలు అన్ని వంట పట్టించుకున్న తారక్ తన ఈ ప్రస్థానానికి కారణమైన ప్రతి ఒక్కరిని అసలు మర్చిపోలేడు. కెరియర్ లో తన గెలుపు ఓటమిలలో కూడా తారక్ కు హరికృష్ణ తోడుగా ఉంటూ వచ్చారు. అంతేకాదు హరికృష్ణ రాజకీయాలకు దూరంగా ఉన్న సందర్బాల్లో కూడా తారక్ తండ్రికి ఎంతో ధైర్యం చెబుతూ వచ్చారు. ప్రస్తుతం తారక్ rrr సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ తో పాటుగా రామ్ చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్. ఆర్. ఆర్ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: