బాలీవుడ్ లో ఎన్నో పాత్రల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటులు నటుడు శ్రీరాం లగూ(92) కన్నుమూశారు.  పుణెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు.  ఇటీవల కాలంలో బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.  సినియర్ నటులు, దర్శకులు కన్నుమూశారు.  ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.  గతకొంత కాలంగా ఆయన వయోభారంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో  పుణెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీరామ్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

 

థియేటర్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలో ప్రవేశించాడు. మొదట నాటకాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన తర్వాత థియేటర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించారు.   హిందీ, మరాఠీ సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. ఇరవైకి పైగా మరాఠీ నాటకాలకు దర్శకత్వం వహించి నాటకరంగంలో సేవలు అందించారు.  సినిమాలకే పరిమిత కాకుండా ఇఎన్‌టి సర్జన్‌గా ప్రజలకు వైద్యసేవలందించారు.  శ్రీరామ్ గారు సామాజిక కార్యకర్తగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.  శ్రీరాం లగూ మరణం పట్ల కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ విచారం వ్యక్తం చేశారు.

 

‘ గొప్ప నటుడు శ్రీరాం లగూ. మనం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయాం... తనదైన అద్భుత నటనతో థియేటర్‌ ఆర్టిస్టుగా రాణించిన ఆయన.. సిల్వర్‌ స్క్రీన్‌పై చెరగని ముద్ర వేశారు.  పలు సామాజిక కార్యక్రమాల్లోనూ భాగమైన శ్రీరాం లగూకు నివాళులు అర్పిస్తున్నా’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. సహజ, సమయస్ఫూర్తి గల నటుడిని కోల్పోయాం అని బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ ట్వీట్‌ చేశారు బాలీవుడ్, మరాఠా చిత్ర పరిశ్రమ పముఖులు ఆయన మృతపట్ల సంతాపంతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇంత గొప్ప నటుడిని కోల్పోవడం  బాలీవుడ్ కి తీరని లోటని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: