నందమూరి మూడో తరం నట వారసుడు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్.. తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. సీనియ‌ర్ ఎన్టీఆర్‌.. తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తర్వాత‌ బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించాడు ఎన్టీఆర్‌. ఇక  ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా హీరోగా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. ఈ సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న ఎన్టీఆర్ ఒక్కో మెట్టు ఎక్కుతూ భారీ విజ‌యాలు త‌న ఖాతాలో వేసుకున్నారు.

 

ఇక  2011లో చంద్రబాబు మేనకోడలు కూతురు లక్ష్మి ప్రణతి తో ఎన్టీఆర్‌కు వివాహం జరిగిన విష‌యం తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే పెళ్లయినప్పటి నుంచి ఎన్టీఆర్ వరుస ఫ్లాపులతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. సింహాద్రి చిత్రం తర్వాత ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పూర్తిగా చతికిల పడ్డాయి. మ‌రియు దమ్ము, శక్తి, రామయ్య వస్తావ రామ‌య్య, రభస చిత్రాలు కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ కెరీర్ పరంగా కూడా సతమతమయ్యాడ‌ని చెప్పాలి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సైతం తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

 

మ‌రోవైపు.. నారా, నంద‌మూరి కుటుంబంలోనే చాలా మంది ఎన్టీఆర్‌ను ద‌గ్గ‌ర‌కు రానియ్య‌లేదు. చివరకు ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అవుతుంటే తెలుగుదేశం పార్టీలోని కొందరు ఎన్టీఆర్ సినిమాలు చూడవద్దని ప్రచారం కూడా చేసేవారు. మ‌రియు  2014లో టీడీపీ గెలిచాక తార‌క్ సినిమాల‌కు థియేట‌ర్లు కూడా దొర‌క‌నీయ‌కుండా చేశారు కొంద‌రు. అలాంటి తీవ్ర పరిస్థితి నుంచి ఎన్టీఆర్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. టెంప‌ర్ సినిమాతో ఊపందుకున్న ఎన్టీఆర్ అంద‌రికీ  షాకిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. 

 

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ మ‌రియు అరవింద సమేత సినిమాల‌తో వ‌ర‌స హిట్లు అందుకుని జోరు మీద ఉన్నాడు. ఈయన ప్రస్తుతం ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళితో `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో బిజీగా ఉన్నాడు. కొన్ని రోజులుగా షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రకు ప్రాణం పోసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇలా పడి లేచిన కెరటం అయ్యాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: