విశ్వవిఖ్యాతనటసార్వభౌమా "నందమూరి తారక రామారావు " సినీ లోకాన్ని ఏలిన చక్రవర్తి. ఎన్టీఆర్ ఈ మూడక్షరాలు సృష్రించిన ప్రభంజనం అంత ఇంత కాదు. సినిమాల్లోనూ...రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ పేరు తలవని రోజంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో? నందమూరి కుటుంబానికి అశేష అభిమానగణం తోడుగా ఉంటుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడాకూడా ఆ అభిమాన ప్రవాహం  తగ్గలేదు. నందమూరి కుటంబానికి అభిమానులు ఎక్కువే , రాజకీయాలు కూడా  ఎక్కువే.. ఆ తరువాత ఎన్టీఆర్ పేరుకు ఎక్కడ మచాటేయకుండా అయన కుమారులు సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

 

ఇక తాతకు తగ్గ మనవడిగా, ఆయన పేరుతోపాటు నటనను, రూపాన్ని పుణికి పుచుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ నటవారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ సినీ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. వైవిధ్యమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ...ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో పనిచేస్తూ తన దూసుకుపోతాన్నాడు. ఈ తరం మోస్ట్ ఎనర్జటిక్ హీరో గా  అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్.1991లో ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాని తీస్తున్నారు. ఆ సినిమాలో మనమడికి భరతుడి వేషం ఇచ్చి ప్రోత్సహించారు. స్వయంగా తానే మేకప్ వేసి ఎలా నటించాలో మెళకువలు నేర్పారు. 

 

ఆ తర్వాత నిర్మాత మల్లెమాల 1996లో నిర్మించిన బాల రామాయణం చిత్రంలో శ్రీరాముడిగా జూనియర్ ఎన్టీఆర్ నటించాడు. ఇక 2001 లో రాజమౌళి తెరకెక్కినచ్చిన స్టూడెంట్ నెం 1 సినిమాతో మొదటి విజయాన్ని అందుకున్న తారక్ ిన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. స్టూడెంట్ నంబర్ వన్ తీసిన రాజమౌళి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో హ్యాట్రిక్ కొట్టారు. 2003లో సింహాద్రి, 2007లో యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ లు తీశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పేరుతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మరో ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరిశ్రమలో తనకి ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ అని చాలా సందర్భాల్లో బహిరంగంగానే రాజమౌళి ప్రకటించారు.


తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అగ్ర దర్శకులందరి సినిమాల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ నటించారు. వివి వినాయక్ తో ఆది, సాంబ, అదుర్స్, బి. గోపాల్ తో అల్లరిరాముడు, నరసింహుడు, డీకే సురేశ్ తో నాగ, పూరి జగన్నాథ్ తో ఆంధ్రావాలా, టెంపర్, సురేంద్రరెడ్డి తో అశోక్, ఊసరవెల్లీ, కృష్ణవంశీ తో రాఖీ, మెహర్ రమేష్ తో కంత్రీ, బోయపాటి శ్రీనుతో దమ్ము, శీను వైట్లతో బాద్ షా, హరీష్ శంకర్ తో రామయ్య వస్తావయ్యా, సంతోష్ శ్రీనివాస్ తో రభస, సుకుమార్ తో నాన్నకు ప్రేమతో, కొరటాల శివతో జనతా గారేజ్, కె.ఎస్. రవీంద్రతో జై లవకుశ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అరవింద సమేత వీర రాఘవ చిత్రాల్లో కధానాయకుడిగా నటించారు.


ఇక సింగర్ గాను ఎన్టీఆర్ తన ప్రతిభను కనబరిచాడు. ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకత్వంలో యమదొంగ సినిమాలో ఓలమ్మి తిక్కరేగిందా? అన్న పాటకు గళం ఇచ్చాడు. మణిశర్మ తో  కంత్రీ సినిమా కోసం వన్ త్వో త్రి నేనొక కంత్రీ, దేవిశ్రీ ప్రసాద్ తో  అదుర్స్ చిత్రం కోసం చారీ అన్న పాటకు, నాన్నకు ప్రేమతో సినిమా కోసం ఫాలో...ఫాలో అన్న పాటకు గళమిచ్చారు. ఎస్. థమన్ సంగీత దర్శకత్వంలో రభస చితం కోసం రాకాసి...రాకాసి అనే పాటను ఆలపించారు. ఎస్. థమన్ కన్నడంలో సంగీతం సమకూర్చిన చిత్రం చక్రవ్యూహ కోసం చెలియా..చెలియా అన్న పాటను జూనియర్ ఎన్టీఆర్ ఆలపించారు.ఇలా  బహుముఖ ప్రజ్ఞాశాలి మన జూనియర్ ఎన్టీఆర్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: