టాలీవుడ్ నటులు సూపర్ స్టార్ కృష్ణ స్వస్థలం గుంటూరు, జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం. మొదటగా సాక్షి సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ, ఆ తరువాత పలువురు సుప్రసిద్ధ దర్శకుల నుండి మంచి అవకాశాలు అందుకుని వాటిని సద్వినియోగం చేసుకున్నారు. మెల్లగా ఒక్కొక్కటిగా హిట్స్ అందుకుంటూ ముందుకు సాగిన కృష్ణకు అప్పట్లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో అనే పేరుంది. ఇక అప్పట్లో కొన్ని వార్తాపత్రికల వారు బెస్ట్ హీరో పోటీలు నిర్వహించగా అనేకమార్లు కృష్ణను నెంబర్ వన్ స్థానం వరించిందని, ఇప్పటికీ కొందరు సీనియర్ జర్నలిస్టులు, కృష్ణ గారి ఇమేజ్ గురించి గుర్తుచేసుకుంటుంటారు. 

 

అయితే ఆయన తరువాత తరంలో రెండవ కుమారుడు మహేష్ బాబు, బాలనటుడిగా చిన్నప్పుడే సినిమాల్లోకి ప్రవేశించి మంచి ప్రేక్షకాదరణ పొందారు. అనంతరం పెరిగి పెద్దయ్యాక, రాజకుమారుడు సినిమాతో హీరోగా మారిన మహేష్ బాబు, తన కెరీర్ మొత్తంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, వాటిని తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరిగా కొనసాగుతున్న మహేష్ బాబుకు, తండ్రి వలె సూపర్ స్టార్ బిరుదు వరించింది. ఇక తన కెరీర్లో ఎన్నో గొప్ప సినిమాల్లో నటించి పలు రివార్డులతో పాటు అవార్డులు కూడా అందుకున్న మన సూపర్ స్టార్, ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో నటించిన శ్రీమంతుడు సినిమా తరువాత, 

 

ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అలానే తండ్రి వలే ఎంతో దయార్ద్ర హృదయం గల మహేష్, ఇటీవల వెయ్యి మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే మహేష్ బాబు, తమ స్వగ్రామం అయిన బుర్రపాలెంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఎంతైనా సూపర్ స్టార్స్ సూపర్ స్టార్సే కదా.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: