ఎన్టీఆర్.. ఈ పేరు వింటే అభిమానుల గుండెల్లో ఒక తెలియని అనుభూతి. ఈ అనుభూతి ఎందుకంటే.. సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో పాటు నటనను తన సొంతం చేసుకొని తెర మీదకు వచ్చాడు. అయన నటనతో అభినయంతో తనకంటూ ఒక పెద్ద గుర్తింపును.. కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. అందరూ అనుకుంటారు ఎన్టీఆర్ కి ఎం తాత, తండ్రి సాయంతో సినిమాల్లోకి వచ్చాడు. 

                     

కానీ.. ఎంత సాయంతో వచ్చిన ఎన్టీఆర్ కి కూడా కష్టాలు చాలానే ఉన్నాయి. ఒక వైపు నందమూరి కుటుంబం.. మరో వైపు నారా కుటంబం కలిసి తోక్కేసిన నెలకు కొట్టిన బంతిలా తారక్ సినిమాలు చేస్తూ ఆకాశం ఎత్తు ఎదిగాడు తారక్. ఒకవైపు బాల కృష్ణ బాబాయ్ తారక్ సినిమాల్లోకి వచ్చినప్పుడు సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తీస్తూ ఫార్మ్ లో ఉన్నాడు. 

                      

ఆ సమయంలోనే సినిమాలలో అడుగుపెట్టాడు ఎన్టీఆర్. సినీ రంగ ప్రవేశం చెయ్యడం ఆలస్యం.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చేసుకున్నాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ ని తట్టుకోవడం బాబాయ్ బాలయ్య వల్ల కూడా కాలేదు.. ఇంకా నారా కుటుంబం రాజకీయాలలోకి రావాలని ఆహ్వానించి ఆ పదవి ఇస్తాం.. ఈ పదవి ఇస్తాం అని ఆశ చూపించి మరి బుట్టలోకి వేసుకొని ఆ కాలంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ని ప్రచారానికి ఉపయోగించుకున్నాడు. 

 

అలా ఒకవైపు నందమూరి కుటుంబం.. మరో వైపు నారా కుటుంబం ఎన్ని ప్రయత్నాలు చేసిన సరే జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు అందనంత స్థాయిలో ఎన్టీఆర్ ఉన్నాడు. అది తారక్ అంటే. 

మరింత సమాచారం తెలుసుకోండి: