జూనియర్ ఎన్టీఆర్ వరుస ఫ్లాపుల తర్వాత 'టెంపర్' సినిమా తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. గతంలో ఈ సినిమా రాకముందు వరకు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు మొత్తం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ఎన్టీఆర్ కెరియర్ ఫుల్ అందకారంగా మారటంతో సినిమా హిట్ కొట్టడం కోసం నానా తంటాలు పడ్డారు. ఈ సమస్య 2009 ఎన్నికల్లో ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం కోసం రాజకీయ క్షేత్రంలో కి దిగటం జరిగిందో అప్పటినుండి అనగా ఎన్నికలు ఆ సమయంలో జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నాటినుండి వరుసగా చేసిన సినిమాలు మొత్తం ఫ్లాప్ అవడం జరిగాయి. దీంతో చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు అనవసరంగా రాజకీయ రంగంలోకి తెలుగుదేశం పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ అతి చిన్న వయసులోనే వెళ్ళటం జరిగిందని అందువల్లనే చేస్తున్న సినిమాలు మొత్తం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి అప్పుడే రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళటం అనేది రాంగ్ స్టెప్ అంటూ చాలామంది నందమూరి అభిమానులు కామెంట్ చేయడం జరిగింది.

 

ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీలో అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కి మంచి నాయకుడిగా లక్షణాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రాజకీయ నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ కామెంట్లు చేయడం తో తెలుగుదేశం పార్టీలో ఉండే చాలా మంది కీలక నాయకులు తమ భవిష్యత్ రాజకీయాలకు జూనియర్ ఎన్టీఆర్ వల్ల ముప్పు ఉందని పకడ్బందీ ప్లాన్ తో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుండా పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా ఒక వ్యూహం ప్రకారం టీడీపీలో కీలకంగా ఉండే నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ని పూర్తిగా పక్కన పెట్టినట్లు అప్పట్లోనే వార్తలు వినపడ్డాయి.

 

ఇటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తున్న వార్తలపై స్పందించి తన కట్టె కాలే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను కానీ రాజకీయాలకు నేను దూరం నా ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని...ఆ రాజకీయ రొచ్చు లోకి నన్ను లాగవద్దు అన్నట్టుగా మీడియా ముఖంగా స్పీచ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: