ప్రభాస్ సినీరంగ ప్రవేశం జరిగిన తీరు చూస్తే అసలు ప్రభాస్ కు నటన అంటే ఇష్టమో కాదో చెప్పలేదు. కాని అతని పెద్దనాన్న అయిన కృష్ణం రాజు గారి ప్రోద్బలంతో సినిమా రంగంలోకి ప్రవేశించాడని ఎప్పుడో వచ్చిన వార్త.. ఇకపోతే కృష్ణంరాజు గారి  సోదరుని కుమారునిగా చిత్రసీమలోకి అడుగు పెట్టిన ప్రభాస్‌కు అతని పెద్దనాన్న ఐనా కృష్ణం రాజు గారితోనే ఎక్కువగా అనుబందం ఉన్నట్లుగా తెలుస్తుంది..

 

 

ఇకపోతే ప్రభాస్ సినిమాల విషయంలో కృష్ణం రాజు ఎక్కువగా కేర్ తీసుకుంటారని వినికిడి.. ఇకపోతే ప్రభాస్ కెరియర్లో చేసినవి తక్కువ సినిమాలైనా హిట్లు మాత్రం బాగానే ఉన్నాయి. సినిమా రంగంలో ప్రభాస్ అడుగుపెట్టాడంటే అది కృష్ణం రాజు చలువే. ఒకప్పుడు కృష్ణం రాజుగారు మా పెద్దనాన్న అని చెప్పుకునే ప్రభాస్ ఇప్పుడు ఆ రేంజ్ లో లేడు. కృష్ణం రాజు గారే ప్రభాస్ నా తమ్ముని కొడుకు అని చెప్పుకునే స్దాయికి ఎదిగాడు.

 

 

ఒక హీరో ఎన్ని సినిమాలు చేసాడు అని ఆలోచించేకంటే ఎంతగా తన పేరు పేరు ప్రఖ్యాతలను దేశం నలుమూలలా వ్యాపింప చేసాడు అనేది ఇక్కడ ముఖ్యం. ఈ విషయంలో ప్రభాస్ వందకు వంద మార్కులు కొట్టేసాడు. చేసిన అతి తక్కువ సినిమాలైనా ఒకే ఒక్క సినిమాతో టాలివుడ్ చరిత్రను ఎక్కడికో ఎదిగేలా చేశాడు.

 

 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రభాస్‌ను గుర్తుపట్టని వారుండరు. అది బాహుబలి సినిమాకే సొంతం. ఒక రకంగా ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణరాజు మరియు శివ కుమారి దంపతుల కుమారుడైనా, కృష్ణం రాజు కుమారుడిగానే అనిపించేలా వారిమధ్య అనుబంధం ఉంది. అందుకే ప్రభాస్ సినిమా విషయాల్లో పెద్దనాన్న గారి పాత్ర ఉంటుంది.

 

 

ఇకపోతే ప్రభాస్ అప్పటివరకు చేసిన సినిమాలు ఓకెత్తైతే ఒక్క బాహుబలి తోనే ఎన్ని సినిమాలు చేసిన రాని క్రేజ్ సంపాదించుకున్నాడు.. ఏదైతేనేమి  కృష్ణం రాజుకున్న రెబల్ స్టార్ బిరుదును పదిలంగా కాపాడుతూ టాలివుడ్ గర్వించే స్దాయికి ఎదిగాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: