టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం లో మరియు డైరెక్టర్ చెప్పింది చేయటంలో ఇండస్ట్రీలో మహేష్ ని మించిన హీరో మరొకరు ఉండరు అని చాలా మహేష్ తో పనిచేసిన డైరెక్టర్లు అంటుంటారు. డైరెక్టర్లు చెప్పింది చేసే హీరో మహేష్ అని 100% డైరెక్టర్ సంతృప్తి చెందేలా షూటింగ్ లో చాలా హార్డ్ వర్క్ చేస్తాడు అని ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లు మహేష్ పనితనం గురించి మెచ్చుకుంటూ పొగడ్తల వర్షం కురిపిస్తారు. ముఖ్యంగా 'పోకిరి' సినిమా నుండి మహేష్ సినిమాలు సెలెక్ట్ చేసుకోవటంలో మరియు మార్కెట్ పెంచుకోవడంలో దృష్టిపెట్టి అద్భుతంగా వరుస విజయాలతో ఇండస్ట్రీలో మెగాస్టార్ తర్వాత అన్నట్టు స్థానాన్ని తన క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

 

'పోకిరి' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్ బాబు ఆ తర్వాత 'బిజినెస్ మాన్' మరియు అదే విధంగా క్లాసికల్ అండ్ మల్టీస్టారర్ సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో 'శ్రీమంతుడు' సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. కాగా ఆ తర్వాత కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో 'స్పైడర్' అనే సినిమా మహేష్ చేయటం జరిగింది. ఈ సినిమాపై మహేష్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. తీరా సినిమా విడుదలయ్యాక మహేష్ కెరీర్ లోనే అత్యంత దారుణమైన అట్టర్ ప్లాప్ సినిమాగా 'స్పైడర్' దారుణమైన డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

 

సినిమా ఫెయిల్ అయినా గాని మహేష్ తన నటన పరంగా మరియు మార్కెట్ పరంగా కోలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోగా మంచి లాభాలు సంపాదించడంతో అప్పట్లో 'స్పైడర్ ' సినిమా ఫెయిల్ అయినా గాని వచ్చిన కలెక్షన్ల విషయం అప్పట్లో అతి పెద్ద హైలెట్ వార్త గా సౌత్ ఇండియాలో వైరల్ అయింది. ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి జనవరి 11న విడుదల చేయనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: