మహేష్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ గా తనయుడుగా సినీప్రస్థానం మొదలు పెట్టిన ఈయన చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలలోకి ఎంటర్ అయ్యారు. ఎన్ని సినిమాల్లో నటించిన కూడా ఇంకా సినిమాలు నాకు నేర్పిస్తున్నాయి అంటూ మహేష్ అనడంలో ఆయన నిదర్శనానికి  ఉదాహరణ అని చెప్పాలి. 26 సినిమాలలో కనిపించిన మహేష్ సినీ ప్రస్థానంలో చాలా హిట్ సినిమాలు ఉన్నాయనే చెప్పాలి. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. 

 

నీడ సినిమాతో టాలీవుడ్ కి బాలనటుడిగా, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసత్వంతో అడుగు పెట్టిన మహేష్ బాబు, చిన్నప్పుడే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక రాజకుమారుడు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ ను చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాదు తొలి చిత్రంతోనే అత్యద్భుత విజయాన్నిఆ అందుకున్న అతి తక్కువమంది టాలీవుడ్ హీరోల్లో మహేష్ కూడా ఒకరు. ఇక ఆ తరువాత నాలుగవ సినిమా మురారితో తన బాక్సాఫీస్ స్టామినాని రుచి చూపించిన మహేష్ బాబు, తన కెరీర్ ఏడవ సినిమాగా వచ్చిన ఒక్కడుతో అతి పెద్ద స్టార్డం ని సంపాదించారు. 

 

మహేష్ కు మంచి లైఫ్ ఇచ్చిన చిత్రాల విషయానికొస్తే.. ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, మహర్షి సినిమాలు మంచి విషయాన్నీ అందుకున్నాయి. హిట్ అవ్వడమే కాకుండా మంచి కలెక్షన్స్ తో కూడా దూసుకుపోయాయి. 25వ చిత్రంగా తెరకెక్కిన మహర్షి చిత్రం మహేష్ పేరును మరో మెట్టుకు తీసుకెళ్లింది. వంశీ పైడి పల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ అవ్వడంతో మహేష్ వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. 

 

ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరూ నీకెవ్వరూ చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 11 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు విడుదలైన వాణ్ణి చిత్రం పై మంచి అంచనాలను పెంచుతున్నాయి. మహేష్ సినిమాకు పోటీగా బన్నీ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మరి ఏ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: