నందమూరి తారక రామారావు... భారతదేశపు మొట్టమొదటి సూపర్ స్టార్ గా కీర్తించబడే ఈ విశ్వవిఖ్యాత నటుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. మరీ ముఖ్యంగా పౌరాణికాల్లో ఉండే ప్రతి ఒక్క పాత్రకి అతను చేసినంత న్యాయం ఇప్పటి వరకూ ఏ ఒక్క హీరో భారత చలన చిత్ర చరిత్రలో చేయలేకపోయాడు అంటే అతిశయోక్తి కాదు. అటువంటి మహోన్నత చరిత్ర కలిగిన సినీనటుడు వారసత్వం పుణికి పుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ మరియు ప్రత్యేకంగా అతని మనవడు జూనియర్ నందమూరి తారక రామారావు అతని పేరు కు న్యాయం చేస్తున్నారా అంటే... అవుననే చెప్పాలి. 

 

జూనియర్ ఎన్టీఆర్ యొక్క డైలాగు డెలివరీ మరియు అతను హావభావాలను చాలా అవలీలగా పలికించిన తీరు అతని తాత నుండి పునికిపుచ్చుకున్నదే. అతను నాట్యం చేసేటప్పుడు అతని విలక్షణమైన శైలి మరియు నలుగురిని ఆకట్టుకునే సౌందర్యం... దివ్యతేజస్సు ప్రతి ఒక్కరికి పెద్దాయనను మరపుకు తెస్తాయి. తాత తో కలిసి కొన్ని సినిమాల్లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత తాతకు తగ్గ మనవడిగా మరి కొద్ది కాలం గడిచాక కొన్నికొన్ని సందర్భాల్లో తాతనే మించిపోయిన వారసుడిగా అందరితో మెప్పు పొందాడు. మరీ ముఖ్యంగా ద్విపాత్రాభినయం మరియు త్రిపాత్రాభినయం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు మాత్రం అతని మనవడు తారక్ దే.

 

ఇక ఎన్టీఆర్ డైలాగులు చెప్పే తీరు మరియు అతని మాటల్లోని స్పష్టత చూస్తుంటే తారక రామారావు గారు అతను రూపంలోనే మన చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఎవరికి తెలుసు మరి కొద్ది సంవత్సరాల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర సీమ లో ఉన్న ప్రతి ఒక్క హీరో ని మించిపోతాడేమో. అతని తాత లాగే దశాబ్దాల కాలం చిత్రసీమను ఏకగ్రీవంగా తేలుతాడు ఏమో... అప్పటివరకూ మనం ఏం మాట్లాడినా ఇద్దరిని వేరు చేస్తున్నట్లు గాక ఒకరిలోనే ఒకరిని చూసుకొనే ఆ పనిని చేయల్సివస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: