జగపతిబాబుకి 'లెజెండ్' సినిమా తన కెరీర్ లో ఏ విధంగా అయితే గుర్తుంటుందో... అతని పేరు వినగానే ఈ తరం కుర్రకారుకు కూడా మొదట గుర్తొచ్చే సినిమా కూడా అదే. ఇక కనుమరుగు అయిపోతున్నాడు అనుకొంటున్న దశలో బాలయ్య బాబు సినిమా 'లెజెండ్' లో దర్శకుడు బోయపాటి శ్రీను జగపతి బాబుని విలన్ గా చూపించగా ఆ పాత్రను జగ్గూ భాయ్ ఒక రేంజ్ లో ఇరగదీశాడు. ఆ తర్వాత వరుస సినిమాల్లో విలన్ గా మరియు తండ్రి పాత్రల్లో దుమ్మురేపాడు. కానీ ఈ మధ్య కాలంలో జగపతి బాబు కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు ఉంది అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. 

 

అసలు మొదటి నుంచి జగపతి బాబుని ఆదరిస్తూ వస్తున్నది ఫ్యామిలీ ఆడియన్స్. వారిలో అతనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కానీ కెరీర్ లో డౌన్ ఫాల్ అయిన తర్వాత చాలా సినిమాలు కేవలం డబ్బు కోసమే చేశానని ఆయన బహిరంగంగా చెప్పాడు. కానీ ఇప్పుడు మళ్లీ పూర్వ స్థాయి వచ్చిన తర్వాత మళ్లీ జగపతిబాబు అదే రకంగా తనకు నచ్చిన సినిమాలనే చేయడం మొదలు పెట్టాడు అని అందరికీ అనుమానాలు వస్తున్నాయి. అదేమిటో తెలియదు కానీ ఉన్నఫలంగా జగ్గు భాయ్ కి అవకాశాలు భారీగా తగ్గిపోయాయి.

 

సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక ప్రముఖ పాత్రకు మొదట జగపతిబాబు అని అనుకున్నా తర్వాత ఆ ప్లేస్ లోకి ప్రకాష్రాజ్ వచ్చేసాడు. దీనిపై వివరణ కూడా జగ్గు భాయ్ కాస్త ఇబ్బంది పడుతూనే ఇచ్చాడు. కాగా ఆ మూవీ తర్వాత నుంచే జగపతిబాబుకు అవకాశాలు తగ్గాయని ఫిలిం సర్కిల్‌ టాక్ జోరందుకుంది. అసలు 'సైరా' తర్వాత ఈ క్రేజీ నటుడు ఏ మూవీలో నటించబోతున్నారని ఇప్పటివరకు క్లారిటీ లేదు. మహేశ్ మూవీకి నో చెప్పడం వల్లే ఈ సినియర్ హీరో దూరమయ్యడా..లేక పర్సనల్‌గానే ఏమైనా బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాడా తెలియలాంటే జగ్గు భాయ్ నోరు విప్పేప్పాలి.

 

ప్రస్తుతానికైతే తమిళం, మలయాళం సినిమాల్లో తన మార్కెట్ ను కొద్దికొద్దిగా పెంచుకున్న జగపతిబాబుకు కొద్ది సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు రాకపోయినా ఇదే రకంగా కొనసాగితే మళ్ళీ పునరాగమనానికి అవకాశం లేకుండా పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: