టాలీవుడ్ లో ముద్దుగా ప్రిన్స్ అని పిలుచుకునే ఏకైక హీరో మహేష్ బాబు.  చిన్నప్పటి నుంచి సినిమా రంగంలోనే ఉన్నారు.  తండ్రి సినిమాల్లో నటిస్తూ... బాలనటుడిగా పేరు తెచ్చుకున్న మహేష్ బాబు 1990 వరకు బాలనటుడిగా సినిమాలు చేశారు.  ఆ తరువాత సినిమాలను పక్కన పెట్టి స్టడీస్ మీద దృష్టి పెట్టారు. 1999లో రాజకుమారుడు ది ప్రిన్స్ గా టాలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  


మూవీ మంచి విజయం సాధించింది.  అప్పటి నుంచి మహేష్ బాబు డిఫరెంట్ సినిమాలు ఎంచుకుంటూ హీరోగా మెప్పిస్తూ వస్తున్నాడు.  క్లాస్ , మాస్ అందరిని మెప్పిస్తూ వస్తున్న మహేష్ బాబు సూపర్ స్టార్ గా మారిపోయాడు.  టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.  వివాదాస్పదానికి దూరంగా ఉండే మహేష్ బాబు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో సఖ్యతగా ఉంటాడు.  


హీరో హీరోయిజం సినిమాలతో పాటుగా సోషల్ మెసేజ్ ఉండే సినిమాలు కూడా అనేకం చేశారు.  అందులో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు వంటివి ఉన్నాయి.  మహర్షి సినిమా కూడా ఈ కోవలోకి వస్తుంది.  భరత్ అనే నేను సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమా.  ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా మహేష్ బాబు ఈ సినిమాలో మెప్పించాడు.  తన విజన్ తో ఆకట్టుకున్నాడు.  


ఇందులో మహేష్ బాబు పాటించే ట్రాఫిక్ రూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఫైన్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా మెచ్చుకోదగ్గదే.  ఈ సినిమాలోని పథకాలను ఇప్పుడు కొన్ని పార్టీలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి.   ట్రాఫిక్ రూల్స్ పాటించని వాళ్లకు భారీ ఫైన్స్, పల్లెటూరిలో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ను ఏర్పాటు చేయడం వంటివి కూడా ఈ సినిమాలో చూపించారు.  ఈ మూవీ మంచి సూపర్ హిట్ కావడంతో పాటు రాజకీయ నాయకులకు కూడా ఈ సినిమా బాగా నచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: