ఘట్టమనేని కృష్ణ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్టార్ మహేష్ బాబు.  మహేష్ బాబు బాలనటుడిగా 1983 నుంచి 1990 వరకు ఏడేళ్లు సినిమాల్లో బాలనటుడిగా నటించారు.  బాలనటుడిగా ఉన్నప్పుడే మహేష్ సొంతంగా ఫ్యాన్స్ ను క్రియేట్ చేసుకున్నాడు.  తనదైన శైలిలో నటిస్తూ మెప్పించారు. చిన్నతనంలోనే డబుల్ రోల్స్ చేసి వావ్ అనిపించిన మహేష్ ఆ తరువాత సినిమా ఇండస్ట్రీని పక్కన పెట్టి చదువుపై దృష్టి పెట్టారు.  


అనంతరం ఫ్యాన్స్ కోరిక మేరకు రాఘవేంద్ర రావు దర్శకత్వంల రాజకుమారుడిగా లాంచ్ అయ్యాడు.  ఈ మూవీ మంచి విజయం సాధించింది.  అప్పటి నుంచి మహేష్ బాబు క్లాస్, మాస్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు.  మహేష్ సినిమా బాగుంది అనే టాక్ వస్తే కలెక్షన్లు సునామి సృష్టిస్తుంది.  బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల్లా బాగాలేకపోతే మాత్రం భారీ లాస్ వస్తుంది.  మహేష్ బాబు పూర్తి స్థాయిలో మాస్ హీరో కాదు.  


అలా అని పక్కా క్లాస్ హీరో కూడా కాదు.  ఇటు ఒక్కడు, టక్కరి దొంగ, పోకిరి, బిజినెస్ మెన్ వంటి మాస్ సినిమాలు తీసి అభిమానులను మెప్పించగలడు.  అలానే, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి క్లాస్ సినిమాలు చేసి మెప్పించగలడు.  మహేష్ కెరీర్లో మహర్షి సినిమా క్లాస్ మూవీగా చెప్పొచ్చు.  అప్పట్లో మురారి, పోకిరి సినిమాలకు ఎలాంటి పేరు వచ్చిందో మహర్షి సినిమాకు కూడా అదే రేంజ్ లో పేరు తెచ్చిపెట్టింది.

 
మహేష్ బాబు ఎలాంటి పాత్రలో అయినా సరే యిట్టె ఇమిడిపోతాడు.  స్పైడర్ సినిమా తరువాత మహెహ్ బాబు తన పంథా మార్చాడు.  లైన్ చెప్పి సినిమా తీయకుండా పూర్తి స్క్రిప్ట్ తో వస్తేనే సినిమా చేయాలని అంటున్నాడు.  స్క్రిప్ట్ మొత్తం రెడీ గా ఉంటేనే కథలు వింటున్నాడు.  లేదంటే నిర్మొహమాటంగా రిజక్ట్ చేస్తున్నారు మహేష్ బాబు.  మొత్తానికి ఈ దశాబ్దంలో మహేష్ అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: