టాలీవుడ్ స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్టైలే వేరు. కెరియర్ మొదట్లోనే రికార్డులతో చెడుగుడు ఆడిన తారక్ తెలుగులో ఎంతమంది స్టార్స్ ఉన్నా తకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో ఎన్.టి.ఆర్ ను మించినవాడు లేడని చెప్పాలి. డైలాగ్ చెప్పాలంటే ఒకప్పుడు ఆ పెద్దాయన చెప్పాలి ఇప్పుడు ఈ తారక రాముడు చెప్పాలన్నట్టుగా క్రేజ్ తెచ్చుకున్నాడు.

 

తారక్ సినిమా అంటే డ్యాన్స్, ఫైట్స్ స్పెషల్ గా ఉంటాయన్నది తెలిసిందే. అయితే డైలాగ్స్ విషయంలో కూడా తారక్ స్పెషల్ కేర్ తీసుకుంటాడు. అందుకే దర్శకులు తారక్ పాత్రని బట్టి ది బెస్ట్ డైలాగ్స్ అందిస్తారు. ఇక ఈతరం కథానాయకులలో పౌరాణిక పాత్రలు చేయాలంటే అది ఒక్క తారక్ కు మాత్రమే చెల్లుతుంది. పాత్ర ఏదైనా ఘట్టమేదైనా నేను రెడీ అని తన సినిమాలో డైలాగ్ రూపంలో తన సత్తా చాటుతాడు తారక్.

 

ఇక యమదొంగ సినిమాలో ఏమంటివేమంటివి డైలాగ్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలిచాడు మన జూనియర్. డైలాగ్ యొక్క ప్రావీణ్యత.. ప్రాముఖ్యత రెండు బాగా తెలిసిన తారక్ ఎక్కడ తగ్గించాలో ఎక్కడ పెంచాలో ఆయనకు తెలుసు. తెలుగు భాష మీద మంచి పట్టు ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతుంది. కొన్నాళ్లు కెరియర్ లో వెనుకపడ్డ తారక్ టెంపర్ తో మళ్లీ పుంజుకున్నాడు.

 

తన అభిమానులను అలరించేందుకు ఎప్పుడు కత్తి మీద సాములాంటి పాత్రలు చేస్తూ సత్తా చాటుతున్న తారక్ ఇప్పుడు మళ్లీ వరుస హిట్లు కొడుతూ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్ మరోసారి తన నట విశ్వరూపం చూపిస్తాడని తెలుస్తుంది. రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రమ చరణ్ కూడా అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. ఎన్టీఆర్, రాం చరణ్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: