ఆయన పేరులోనే ఒక సంచలనం ఉంది... ఇక ఆయన ముఖంలో ఒక మహానుభావుడి చరిష్మా  ఉంది... ఆయన నటన లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది.. ఆయనే నందమూరి  నట వారసుడు.. విలక్షణ నటుడు టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ పేరు వింటే చాలు తెలుగు ప్రేక్షకుల్లో పూనకం వచ్చేస్తోంది. ఇక ఈ హీరో సినిమాలు చూశారా...జూనియర్ ఎన్టీఆర్  నటనకు సగటు ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకొని నిలబడతాయి. అలాంటి గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ తనయుడిగా నందమూరి అసలుసిసలైన నట వారసుడిగా అంచలంచలుగా ఎదుగుతూ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరికీ ఫేవరెట్ హీరో గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి తన నట విశ్వరూపం చూపించ గల సత్తా జూనియర్ ఎన్టీఆర్ సొంతం. జూనియర్ ఎన్టీఆర్ నటన కి మహామహులు సైతం ఔరా అనాల్సిందే. 

 

 

 

 అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్  సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో  అసలు సిసలైన తెలుగు పౌరుషాన్ని ఆంగ్లేయులకు రుచి చూపించిన కొమరంభీం పాత్రలో నటిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే దర్శకధీరుడు తెరకెక్కించిన సినిమాల గురించి చెప్పాల్సిన పనిలేదు. శిల్పి జక్కన చెక్కిన శిల్పాలు అన్ని అపురూపమైనవి అన్నట్లుగా దర్శక ధీరుడు జక్కన్నసినిమా తెరకెక్కించిన అది సెన్సేషనల్ హిట్ గా మారిపోతుంది. ఓటమెరుగని దర్శకునిగా.. సంచలన విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు రాజమౌళి. బాహుబలి తర్వాత రాజమౌళి కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. దర్శక ధీరుడు రాజమౌళి సినిమా వస్తుందంటే ప్రపంచంలో వెయ్యి కళ్ళతో ఎదురు చూసే అభిమానులు ఎంతో మంది. ఇక రాజమౌళి దర్శకత్వ ప్రతిభను చూసి ప్రపంచం మొత్తం ఔరా అంటుంది . 

 

 

 

 తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని  ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందేలా చేసి ప్రపంచం మొత్తం మెచ్చిన దర్శకుడు... ఓటమెరుగని ధీరుడు... బాక్సాఫీస్ను షేక్ చేస్తూ రికార్డులు సృష్టించే ఒక ఇన్స్పిరేషన్ రాజమౌళి. బాహుబలి సినిమా ప్రపంచ స్థాయిలో విజయం సాధించిన తర్వాత... బాహుబలి సినిమా చూసిన మహామహులు అందరూ సాహో దర్శక ధీరా రాజమౌళి అంటూ ప్రశంసలు కురిపించారు. నీ ప్రతిభకు ఎవరూ సాటి లేరు అంటూ ఆకాశానికి ఎత్తేసారు. అయితే ప్రపంచం మెచ్చిన దర్శకుడు రాజమౌళి కి మాత్రం.. ఫేవరెట్ హీరో ఎవరు అంటే.. జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి ఎన్నో సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్ తో ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో  భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: