ఈశ్వర్ టైంలో కృష్ణం రాజు కూడా అనుకున్నాడో లేదో ప్రభాస్ మన తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా చేస్తాడని.. అంతేకాదు అప్పట్లో ఆయన అనుకున్నాడో లేదో ప్రభాస్ నటనా కన్యను వరించే రారాజుగా మారుతాడని.. కాని వీటన్నిటిని చేసి చూపించాడు ఉప్పలపాటి ప్రభాస్ రాజు. ఈశ్వర్ నుండి సాహో వరకు ప్రభాస్ కెరియర్ గ్రాఫ్ చూస్తే అదిరిపోయింది చెప్పొచ్చు. తనలోని ఈ మాస్ యాంగిల్ చూసి ఛత్రపతి ఛాన్స్ ఇచ్చాడు రాజమౌళి. ఆ సినిమా ప్రభాస్ కెరియర్ మీద బలమైన ముద్ర వేసింది.

 

కటౌట్ కు తగిన సినిమాలు చేస్తే కచ్చితంగా రికార్డుల రారాజు అనిపిస్తాడు. బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలో ప్రభాస్ చూపించిన అభినయం అతని ఫ్యాన్ గా ఉన్నందుకు కుర్రాళ్లందరు కాలర్ ఎగురేయాలనిపించేలా చేస్తుంది. మాములుగా ఆఫ్ స్క్రీన్ చాలా సిగ్గు, బిడియంతో కనిపించే ప్రభాస్ ఒక్కసరి డైరక్టర్ యాక్షన్ చెప్పగానే పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. 

 

అదుకే అతను చేసే సినిమాల్లో పాత్ర కనబడుతుంది తప్ప ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం కనబడదు. అయితే తను ఎంచుకునే సినిమాలన్ని తన ఇమేజ్ పెంచేలా ఉంటాయని చెప్పొచ్చు. డార్లింగ్, మిస్ట్ర్ పర్ఫెక్ట్, మిర్చి వరకు లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చిన ప్రభాస్ బాహుబలితో తన పంథా మార్చుకున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమా ప్రభాస్ రేంజ్ మరింత పెంచిందని చెప్పొచ్చు. ఆ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడకున్నా హింది వర్షన్ మాత్రం లాభాలు తెచ్చింది. అందుకే ఇప్పుడు ప్రభాస్ అంటే పాన్ ఇండియా స్టార్ అనాల్సిందే.

 

సరైన పాత్ర రావాలే కాని తన సత్తా ఏంటో చూపిస్తా అంటున్న ప్రభాస్ బాహుబలి తర్వాత తనకున్న ఈ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని తెలుగులో చేస్తున్న ప్రతి సినిమాను నేషనల్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: