నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. తాతకు తగ్గ మనవడిగా తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రహీరోగా కొనసాగుతున్నాడు. ఇక వెండితెరపై తారక్.. మొదట 1996లో గుణ శేఖర్ దర్శకత్వంలో అంతా చిన్నపిల్లలతో యం.యస్.రెడ్డి తెరకెక్కించిన ‘రామాయణం’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అప్పట్లో ఈసినిమా ప్రేక్షకాదరణ పొందింది. అంతేకాదు ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఇదే కాకుండా 1991 సంవత్సరంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో చిన్న పాత్రలో నటించాడు కూడా.

 

 

ఇకపోతే హీరోగా నిన్ను చూడాలని సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన జూనియర్ కు తొలి సినిమా ఫలితం నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఇక అప్పటికే ముద్దుగా బొద్దుగా ఉన్న తారక్‌ను చూసిన వారికి ఈ మొద్దబ్బాయ్ సినిమాలను ఎలాచేస్తాడో అనే డౌట్ కూడా వచ్చేదట. కాని ఆ పర్సనాలిటితోనే రాజమౌళి తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ 1, సుబ్బు, అల్లరిరాముడు, నాగ, సింహాద్రి, ఆంధ్రావాలా, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ సినిమాలు పూర్తి చేశాడు. అతని నటనకు అతని పర్సనాలిటీ ఏమాత్రం అడ్డుపడలేకపోయింది.

 

 

కాని ప్రేక్షకులకు హీరో అంటే ఓ విజన్ ఉంటుంది. ఆవిజన్‌ను పసిగట్టిన డైరెక్టర్ రాజమౌళి అప్పుడు ఒక కొత్త హీరోను తెరపై ఆవిష్కరించాడు. ఆ సినిమానే యమదొంగ.. ఈ చిత్రంలో మొద్దబాయ్ కాస్తా స్లీమ్ గా ముద్దబ్బాయ్ గా మారి అదిగో అప్పటి నుండి సరికొత్తగా కనబడటం మొదలు పెట్టాడు. ఇక అప్పటి నుండి చూసుకుంటే ఇప్పటి వరకు తారక్ నటించిన ప్రతి సినిమా విభిన్నంగా ఉండటమే కాదు. ఈ మొద్దబ్బాయ్ ఎంతలా మారి పోయాడు అని అనుకునే స్దాయికి చేరాడు.. ఇకపోతే మద్య మద్యలో ప్లాప్‌లు పలకరించిన టెంపర్ సినిమా నుండి ఎన్టీయార్ నటించిన సినిమాలన్నీ హిట్ అవుతూ వరుసగా దూసుకు పోతున్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: