ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు చాలా మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో సినిమా హీరోయిన్స్ రెమ్యునరేషన్ విషయం కూడా కొంచం మారిందనే చెప్పాలి. ఆ హీరోయిన్ నటించిన సినిమాలు చాలా వరకు హిట్ సినిమాలు అయితే, సినిమాలు చేయడానికి చాలా మంది అడిగినంత ఇచ్చి మరి సినిమాలల్లో నటించడానికి తీసుకొస్తారు. అలా అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ముఖ్యంగా వినిపించే పేరు నయనతార.. ఇప్పుడు ఈ కోవలోకి అల్లుఅర్జున్ బ్యూటీ కేథరిన్ కూడా వచ్చి చేరింది. 

 

వివరాల్లోకి వెళితే.. "రూలర్" సినిమాతో సందడి  చేయడానికి నందమూరి నటసింహం బాలయ్య సిద్దమైపోయాడు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న  పాత్రల్లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. గతంలో బోయపాటి బాలయ్యతో సింహ, లెజెండ్, లాంటి భారీ హిట్లను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తో హ్యాట్రిక్ సాధిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.  బోయపాటి కూడా అభిమానుల అంచనాలకు  ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు పడుతున్నాడు. 


ఇదిలా ఉంటే హీరోయిన్ విషయంలో గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఎందరో హీరోయిన్లను సంప్రదించినప్పటికీ పలు కారణాల వల్ల ఎవ్వరూ ఒకే  చేయలేదట. ఈ మేరకు కీర్తి సురేష్ కూడా రిజెక్ట్ చేసిందని వార్తలు వచ్చాయి. దీంతో బాలయ్యకు హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయి అని అంతా చెప్పుకున్నారు.కానీ బాలయ్య తో రొమాన్స్ కు నేను సై అంటూ ఓ చిన్నది ముందుకొచ్చిందంట.. ఆ ముద్దుగుమ్మ ఎవరోకాదు.. క్యాథరిన్ థెరిస్సా .బోయపాటి సినిమాలో కేథరన్ ఇంతకు ముందు కూడా రెండుసార్లు నటించింది ఈ చిన్నది. అందుకే  బాలయ్య సరసన నటించడానికి వెంటనే ఓకె చెప్పినట్లు సమాచారం.  


అంత బాగానే ఉన్న  రెమ్యూనిరేషన్ విషయంలో ఈ భామ భారీగా డిమాండ్ చేస్తుందంట. ఏకంగా కోటిరూపాయల వరకు అడిగినట్టు సమాచారం. దాంతో నిర్మాతలు అమ్మడితో బేరానికి దిగారంట. బాలయ్య పక్కన హీరోయిన్ గా యంగ్ బ్యూటీ లు దొరకడమే కష్టం. దొరికిన తరువాత లక్ష అటు ఇటు అయినా ఓకె అని డిసైడ్ అయిపోయి, 80 లక్షలకు సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ విధంగా కేథరిన్ రెమ్యూనిరేషన్ 80 లక్షలకు సెటిల్ చేసి, ఓకె చేయించుకున్నట్లు తెలుస్తుంది. పైగా ఈ సినిమాలో ఇద్దరు సీనియర్ హీరోలు విలన్స్ గా నటిస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: