నందమూరి ఫామిలీ అనగానే మనకి గుర్తుకు వచ్చేది తిరుగులేని రాజసం .. ఈ ఫ్యామిలీ కి సపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉంటూనే, సామాన్య ప్రేక్షకులలో కూడా ఒక గుర్తింపు ఉంది. అయితే రానున్న రోజుల్లో ఈ నందమూరి ఫామిలీ పరిస్తితి ఏంటి ? ఎవరెవరు ఈ ఫామిలీ లేగశీ ని ముందుకి తీసుకుని వెళతారు అనేది ప్రశ్నార్థకం గా మారింది . నందమూరి అనే నాలుగు అక్షరాలకీ కొన్ని శతాబ్దాల పాటు వన్నె తీసుకొచ్చిన ధీరుడు సీనియర్ ఎన్‌టి‌ఆర్ తరవాత ఆయన వారసత్వాన్ని సరిగ్గా ముందుకు తీసుకుని వెళ్ళడం లో ఆయన తరవాత తరం నటులు తడబడుతూ వస్తున్నారు.

 

 

 

నందమూరి బాలకృష్ణ నందమూరి ఫాన్స్ ఎన్ని సంవత్సరాల పాటు నెత్తిన పెట్టుకున్నారో తెలిసిందే అయితే భవిష్యత్తు లో సీనియర్ హీరో ఐన బాలయ్య ఏ స్థాయి లో అలరిస్తాడు అనేది చెప్పలేం. ఇక బాలయ్య తరం తరవాత వచ్చిన జూనియర్ ఎన్‌టి‌ఆర్ అడుగు పెట్టడం తోనే సింహాద్రి తో సీనియర్ హీరోలకి చెమటలు పట్టించాడు. ముఖ్యంగా ఇండస్ట్రి లో జూనియర్ ఎన్‌టి‌ఆర్ డాన్సుల గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. యంగ్ జెనెరేషన్ హీరోలలో నెంబర్ 1 డాన్సర్ గా నిలుస్తున్న జూనియర్ ఎన్‌టి‌ఆర్ తన డాన్స్ లతో అందరినీ మైమరిపిస్తూ ఉంటాడు.

 

 

ఫ్లోర్ డాన్స్ , క్యాప్ డాన్స్ ఇలా ఒకటేవిటి చాలా రకాల స్టైల్స్ జూనియర్ ఎన్‌టి‌ఆర్ సొంతం. ఎలాంటి సబ్జెక్ట్ తీసుకున్నా దాంట్లో అలవోకగా యాక్షన్ చెయ్యడమే కాకుండా డాన్స్ లో తనకి తానే అని అనేకసార్లు రుజువు చేసుకోగలిగాడు ఈ యంగ్ టైగర్. తెరమీద ఒక మంచి బీట్ ఉన్న పాట పడితే దాని జూనియర్ ఎన్‌టి‌ఆర్ డాన్స్ చేస్తుంటే ప్రేక్షకులు కళ్ళర్పకుండా చూస్తారు అనడం అతిశయోక్తి కాదేమో..

 

 

ఇండస్ట్రి లో ఎంతమంది యంగ్ హీరోలు ఉన్నా తారక్ లాగా మేటి డాన్సర్ ఒక్కరూ లేరు. నాచోరే నాచో అంటూ ఎన్‌టి‌ఆర్ గనక రంగం లోకి దిగితే ఎంతటి ఘనాపాటి డాన్సర్లు ఐనా పక్కకి తప్పుకోవాల్సిందే !

మరింత సమాచారం తెలుసుకోండి: