2010 నుండి 2019 వరకు టాలీవుడ్ సినిమాల సత్తా ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసింది. దశాబ్ధం క్రితం 50 కోట్లు వసూల్లే అతి కష్టం అనిపించి.. 100 కోట్లు వసూళ్లు అందని ద్రాక్షలా ఉండే తెలుగు సినిమా స్థాయి వందల కోట్ల బడ్జెట్ వేల కోట్ల కలక్షన్స్ వచ్చేలా తయారైంది. వీటన్నిటికి రాజమౌళి బాహుబలి కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కంటెంట్ ఉన్న సినిమాకు కోట్ల బడ్జెట్ పెట్టినా దాన్ని అంతకు రెట్టింపు రాబట్ట వచ్చని చేసి చూపించాడు దర్శకధీరుడు రాజమౌళి.

 

ఇక ఈ దశాబ్ధంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేషనల్ స్టార్ గా ఎదిగాడు. 2010లో డార్లింగ్ తో హిట్ అందుకుని ఆ తర్వాత 2011 లో మిస్టర్ పర్ఫెక్ట్ తో కూడా పర్వాలేదు అనిపించుకున్న ప్రభాస్ ఆ తర్వాత వచ్చిన రెబల్ సినిమాతో షాక్ తిన్నాడు. అయితే ఆ నెక్స్ట్ వచ్చిన మిర్చితో కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా హిట్ అందుకున్నాడు. ఇక తర్వాత చేసిన సినిమా బాహుబలి. ఇక ఆ సినిమా వసూళ్లు సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 

ఈ దశాబ్ధ కాలంలో కేవలం తెలుగు హీరోగా ఉన్న ప్రభాస్ కాస్త నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ విషయానికి వస్తే.. ఈ పదేళ్లలో పది సినిమాలు చేసిన మహేష్ ఈ దశాబ్ధంలో మరింత స్ట్రాంగ్ గా మారాడు. ఈ పదేళ్లలో 10 సినిమాలు చేసిన మహేష్ ఆరు సినిమాలు హిట్ అందుకున్నాడు. 2010 ఖలేజాతో ఫ్లాప్ అందుకున్నా.. దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో సంచలన విజయాలను అందుకున్నాడు మహేష్.

 

ఇక ఈ దశాబ్ధంలో తారక్ కెరియర్ గ్రాఫ్ అద్బుగంతా పెరిగింది. 2010 లో అదుర్స్ తో యావరేజ్ అనిపించుకున్న తారక్ అదే సంవత్సరం బృందావనం సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత శక్తి డిజాస్టర్ కాగా ఊసరవెల్లి కూడా యావరేజ్ అనిపించుకుంది. ఆ తర్వాత దమ్ము భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ కాగా ఆ తర్వాత బాద్షా పర్వాలేదు అనిపించుకుంది. టెంపర్ కు ముందు రామయ్య వస్తావయ్య, రభస సినిమాలు ఎందుకు తీశాడో తారక్ కే తెలియాలి. రొటీన్ ఫార్మెట్ లో వెళ్తున్న టైంలో పూరి డైరక్షన్ లో టెంపర్ అంటూ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత వీర రాఘవ ఇలా అన్ని అంచనాలను అందుకునేలా చేస్తూ వచ్చాడు.

ఈ దశాబ్ధ కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో బ్లాక్ స్టర్ హిట్లు.. సూపర్ హిట్లు.. హిట్టు సినిమాలు ఇచ్చి ఈ దశాబ్ధలు తెలుగు పరిశ్రమ త్రిమూర్తులుగా క్రేజ్ తెచ్చుకున్నారు ప్రభాస్, మహేష్, ఎన్.టి.ఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: