ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఎలా వాడాలో ఆ హీరో స్కెచ్ వేస్తున్నాడు. ఓ ర‌కంగా చెప్పాలంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను మ్యాగ్జిమం వాడుకోవాల‌ని డిసైడ్ అయ్యాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఇంత క్లోజ్‌గా ఉప‌యోగించుకునే వ్యక్తి ఎవ‌రై ఉంటారా అని అనుకుంటాన్నారా? ఈపాటికే అర్ధం అయి ఉంటుంది. త‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీర‌భిమాని నితిన్‌. నితిన్ త‌న అప్‌క‌మింగ్ ఫిల్మ్ హార్ట్ఎటాక్ మూవీ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరును ఏ విధంగా వాడుకోవాలా అని తెగ ఆలోచిస్తున్నాడు. హార్ట్ ఎటాక్ మూవీలో హీరో నితిన్ అయినా, డైరెక్టర్ మాత్రం పూరీజ‌గ‌న్నాధ్‌. ఈ మ‌ధ్య కాలంలో పూరీకు, ప‌న‌న్‌కు అంత‌గా ప‌రిచ‌యాలు లేక‌పోవ‌డంతో, వీరిద్దరి మ‌న‌స్పర్ధలు నితిన్‌కు త‌ల‌నొప్పిగా మారింది. ప‌వ‌న్‌ను ఆడియో ఫంక్షన్‌కు తీసుకురావాలంటే ముందుగా పూరీజ‌గ‌న్నాధ్‌కు ఆ విష‌యం చెప్పాలి. పూరీకు చెప్పాడంటే క‌చ్ఛితంగా నో అంటాడు. కాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సెంటిమెంట్ లేనిదే నితిన్ ఒక్కడుగు కూడ ముందుకు వేయ‌లేని ప‌రిస్థితి. అందుకే ఓ బిగ్ స్కెచ్ వేస్తున్నాడు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆడియో ఫంక్షన్‌కు రాక‌పోయినా, వేధిక ఎక్కిన త‌రువాత నితిన్ తన స్పీచ్ మ‌ధ్యలో ప‌వ‌న్ పేరును ఉప‌యోగించుకోవాల‌ని, దానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేసుకుంటాన్నాడు. ఈ విధంగా చేస్తే పూరీకు కోపం రాదా అని కొంద‌రు అంటుంటే, 'ఇంకేముంది మూవీ ఫినిష్ అయిపోయి ఉంటుంది క‌దా. ఏమన్నా ఉంటే త‌రువాత చూద్ధాంలే' అంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: