భారత సిని పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు అయిన శ్రీ రాం లగూ (92) కన్నుమూశారు. ప్రస్తుతం అయన వయస్సు 92 సంవత్సరాలు.

 


1927లో నవంబర్ 16వ తేదీన మహారాష్ట్రలోని సతారాలో జన్మించిన శ్రీరామ్‌ లాగూ.. మరాఠీ రంగస్థల నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో కాలుమోపి రాణించారు. ఇప్పటివరకు ఆయన వందకు పైగా హిందీ, మరాఠీ, గుజరాతీ చిత్రాల్లో నటించారు.100 కి పైగా సినిమాలు చేసాడు "శ్రీ రాం లగూ "

 


యువకుడిగా ఉన్నపుడు కొన్ని రోజులు ఈఎన్‌టీ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసిన ఆయన.. ఆ తర్వాత సినిమాలపై మక్కువతో సినిమాలు, నాటకాలు చేశారు. ఆయన నటనకు గాను ప్రభుత్వం నుంచి పలు అవార్డులు రివార్డులు కూడా అందాయి. ఘరొండ చిత్రంలో ఉత్తమ నటనకుగానూ 1978లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు.

 


చిత్ర సీమతో పాటు, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, పలువురు ప్రముఖులు సంతాపo తెలియచేసారు. కెరీర్ మొత్తంలో 211 సినిమాలకు పైగా సినిమాలు చేశారు శ్రీరామ్‌ లాగూ. ఆయన నటించిన మరాఠీ చిత్రాల్లో సింహాసన్ (1980), సామన (1974), పింజ్రా (1973) ప్రముఖమైనవి. బాలీవుడ్‌ చిత్రాలైన జమానే కో దిఖానా హై (1981), ఖుద్దార్‌ (1994), లావారిస్‌ (1981), ఇన్‌సాఫ్‌కా తారాజు (1980) మొదలైన చిత్రాల్లో నటించారు..

 


మరాఠిలో అభిమానులు శ్రీరాం లగూ ని ముద్దుగా నట సామ్రాట్ అని పిలుస్తు ఉంటారట. ఆనాటి కాలంలో అయన క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయం సాధించాయి. నటన చెడుతూనే నాటకాలకి దర్శకత్వం కూడా చేసేవారట. మరాఠి నాటకాలు ఎక్కువ గా దర్శకత్వం వహించేవారు. అంతేకాదు అయన ఒక డాక్టర్.. యాక్టర్... దర్శకుడు..












మరింత సమాచారం తెలుసుకోండి: