మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాతో తెరంగేట్రం చేసిన రాం చరణ్ ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వచ్చి మెగా పవర్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. నటనలో అందరి స్టార్ హీరోలకు ఒక అడుగు వెనుకే అని అనుకున్న వాళ్లందరికి రంగస్థలం సినిమాతో గూబ అదిరే సమాధానం ఇచ్చాడు మన చిట్టి బాబు అదేనండి రాం చరణ్. చిరు వారసుడిగా నట వారసత్వమే కాదు మంచి మాటమంతి కూడా నేర్చుకున్నాడు రాం చరణ్.

 

ఇదివరకు మైక్ ఇస్తే ఏదో పొడి పొడిగా రెండు మాటలు మాట్లాడి మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహపరచే రాం చరణ్ ఈమధ్య తన పంథా మార్చుకున్నాడు. తనకు మైక్ ఇస్తే ఆ వేదిక యొక్క ప్రాముఖ్యతని వివరిస్తూ ఆ సమయానికి తగినట్టుగా మాట్లాడుతూ అక్కడ ఉన్న సిని పెద్దలను గౌరవిస్తూ మాట్లాడుతున్నాడు. పరిశ్రమలో అలా మాట్లాడే ఒకే ఒక్క హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ఇప్పుడు అతన్ని ఫాలో అవుతున్నట్టు ఉన్నాడు రాం చరణ్.

 

ఎంతైనా ఇద్దరూ స్నేహితులే కదా.. తారక్ మాట్లాడే తీరు అభిమానులకే కాదు సిని ప్రియులను మెప్పిస్తుంది. అలానే రాం చరణ్ కూడా ఈమధ్య చాలా ఫంక్షన్స్ లో తన స్పీచ్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇక లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 ఈవెంట్ లో కూడా సల్మాన్, వెంకటేష్, సుదీప్, చిరంజీవిలను ప్రస్థావిస్తూ వారితో వేదిక పంచుకోవడం సంతోషంగా ఉందని. వీరి నుండి సక్సెస్.. సినిమాల కనా డిసిప్లేన్ నేర్చుకున్నానని అన్నారు రాం చరణ్.

 

తమ సీనియర్స్ నుండి డిసిప్లేన్ ను నేర్చుకున్నా అని రాం చరణ్ చెప్పిన మాటలు మెగా ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఏది ఏమైనా తారక్ లా రాం చరణ్ కూడా ఈమధ్య బాగా పరిణితి చెందాడని.. అందుకే బయట మెగ నందమూరి ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతున్నా సరే రాం చరణ్, తారక్ లు మాత్రం ఇవేమి పట్టించుకోవడం లేదని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: