రేపు విడుదలకాబోతున్న ‘రూలర్’ మూవీ కథ ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను టార్గెట్ చేస్తూ వ్రాయబడ్డ కథ అని అంటారు. అయితే ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడం జగన్ అధికారంలోకి రావడంతో బాలకృష్ణ సూచనలతో ఈమూవీ కథను ఆంధ్రప్రదేశ్ రాజకీయల నుండి తప్పించి ఉత్తర భారతదేశ నేపధ్యంలో రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఈమూవీ కథను మార్చారు.

అయితే ఈమూవీ కథకు సంబంధించిన ప్రాంత నేపధ్యం తెలుగురాష్ట్రాలు కాకపోయినా ఈమూవీలో కొన్ని చోట్ల బాలయ్య నోటివెంట వచ్చే పంచ్ డైలాగులు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలను పరోక్షంగా జగన్ ను టార్గెట్ చేసే విధంగా బాలకృష్ణ చాల వ్యూహాత్మకంగా ఈమూవీ కథలోని డైలాగులను తన పొలిటికల్ ఇమేజ్ కి ఉపయోగపడే విధంగా వ్రాయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ‘పదవి అంటే నువ్వు చదివిని డిగ్రీ అనుకుంటున్నావా.. చచ్చేవరకు నీ వెంట రావడానికి.. ఎలక్షన్ ఎలక్షన్‌కు పవర్ కట్ అవుతుందిరా పోరంబోకు’ అంటూ విలన్‌ను హెచ్చరిస్తూ సాగే డైలాగ్ బాలకృష్ణ నోటివెంట రావడంతో ఈడైలాగ్ తెలుగు రాష్ట్రాలలోని ఏప్రముఖ రాజకీయ నాయకుడుని టార్గెట్ చేస్తూ బాలయ్య ఈపంచ్ డైలాగ్ వాడాడు అంటూ ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

అంతేకాదు ఈమూవీలో ఇలాంటి రాజకీయ పంచ్ లు చాల ఉన్నాయని కొన్ని డైలాగులు అయితే డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్న కొందరు ప్రముఖ నాయకులను టార్గెట్ చేస్తున్నట్లుగా ఈమూవీని చూసే ప్రేక్షకులకు అర్ధం అవుతుంది అంటూ వార్తలు గుప్పు మంటున్నా యి. వాస్తవానికి బాలకృష్ణకు ఉన్న మాస్ ఫాలోయింగ్ రీత్యా బాలయ్య సినిమాలకు గతంలో ఆసినిమా రిజల్ట్ ఎలా ఉన్నా భారీ ఓపెనింగ్స్ రావడం ఒక పరిపాటుగా మారింది. 

 అయితే ఈసారిమాత్రం  బాలయ్య ‘రూలర్’ పరిస్థితి ఆశాజనకంగా లేదని అంటున్నారు. రేపు రూలర్ తో పాటు 'ప్రతిరోజూ పండగే' 'దొంగ' 'దబాంగ్ 3' విడుదల అవుతున్నాయి. దీనితో బాలయ్య సినిమాకు మన తెలుగురాష్ట్రాలలో సరైన ధియేటర్లు కూడ దొరకలేదు అన్నవార్తలు వస్తున్నాయి. దీనికితోడు. 'రూలర్' విషయంలో హైప్ లేకపోవడంతో చాలామంది ధియేటర్ల యజమానులు ‘రూలర్’ పై కంటే సాయి తేజ్ కార్తి సల్మాన్ ఖాన్ ల సినిమాలను ప్రదర్శించడానికి ఆసక్తి కనపరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ‘రూలర్’ సినిమాను ఇన్ని సినిమాల మధ్య పోటీగా నిలిపి బాలయ్య నిర్మాత సి. కళ్యాణ్ పొరపాటు చేసారు అంటూ మరికొందరి అభిప్రాయం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: