బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలకు క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే.. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఘనత సల్మాన్ కి ఉంది.. అయితే, సల్మాన్ హిందీలో దబాంగ్ సినిమాలో నటించారు.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సినిమా సీక్వెల్ గా దబాంగ్ 2 సినిమాలో చేశారు.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు దబాంగ్ 3 లో నటించారు. డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శత్వం వహించారు..


కాగా ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కు సిద్దమవుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్య్రమానికి వెంకటేశ్, రామ్ చరణ్ లు హాజరయ్యి సందడి చేశారు.ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ..హైదరాబాద్ రావడం ఆనందంగా ఉంది. 

 

తెలుగు వారితో నాకు మంచి అనుబంధం ఉంది. మా చిత్ర బృందానికి ఘనంగా స్వాగతం లభించింది. మా సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొనడం ఆనందంగా ఉంది. అతన్ని చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఆయన తండ్రి చిరంజీవి నాకు అత్యంత ఆప్తులు.

 

వెంకటేశ్ మాట్లాడుతూ..దబాంగ్ 3’ తెలుగు వెర్షన్‌లో డ్రెస్సేస్తే పోలీస్.. తీసేస్తే గూండా అంటూ సల్మాన్ భాయ్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. సల్మాన్ ఖాన్‌ను తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానిస్తారు.. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు వెంకటేష్... ఈ కార్యక్రమంలో సల్మాన్ అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టాడు..వెంకటేష్, రామ్ చరణ్‌లతో సైతం స్టెప్పులు వేయించి అభిమానుల్లో ఉత్సాహం నింపారు సల్మాన్. ఈ ముగ్గురు స్టార్లు స్టేజ్‌ను షేర్ చేసుకుని స్టెప్పులేస్తుంటే.. అభిమానులు ఉత్సాహానికి అవధులు లేవు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: