‘దబాంగ్‌’ సిరీస్‌లో సల్మాన్‌ఖాన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘దబాంగ్‌ 3’.  ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో కథానాయికగా సోనాక్షీ సిన్హా  నటించారు. అర్బాజ్‌ ఖాన్, నిఖిల్‌ ద్వివేది, సల్మాన్‌ఖాన్‌ నిర్మించిన ఈ చిత్రం రేపు హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో  విడుదల కానుంది. సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌ సౌజన్యంతో సురేష్‌ ప్రొడక్షన్స్, గ్లోబల్‌ సినిమాస్‌ ‘దబాంగ్‌ 3’ తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తున్నారు. బుధవారం ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ వేడుక  జరిగింది.ఈ వేడుకకు అతిథులుగా హీరోలు వెంకటేష్, రామ్‌ చరణ్‌  హాజరయ్యారు. సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ – వెంకటేష్‌గారు.. నాకు పాతికేళ్లుగా స్నేహితులు ,రామ్‌చరణ్‌ నాన్నగారు చిరంజీవి నాకు చాలా క్లోజ్‌. నాకు తమ్ముడులాంటివాడు రామ్‌చరణ్‌ . చరణ్‌ కూడా నాకు క్లోజే. ఈ సినిమాలో కన్నడ నటుడు సుదీప్‌ హీరోగా నా స్థాయిని పెంచేలా నటించారు . ‘దబాంగ్‌ 3’ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అంటూ చిత్రంలోని  ‘ఆటకైనా.. వేటకైనా రెడీ’ అనే డైలాగ్‌ చెప్పారు.

 

సల్మాన్‌ డైలాగ్స్‌ ‘‘దబాంగ్‌ 3’లో  మామూలుగా లేవు.  వెంకటేష్‌ మాట్లాడుతూ ...ఈ సినిమాను సల్మాన్‌ను ప్రేమించే అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా  హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను ’’ అన్నారు. ‘‘సల్మాన్‌భాయ్‌ నుంచి ఎన్ని నేర్చుకుంటున్నానో వివరించడానికి ఒక వేదిక, కొన్ని మాటలు సరిపోవు. సల్మాన్, సుదీప్, వెంకటేష్‌గారు, చిరంజీవిగారు.. ఇలాంటి సూపర్‌ స్టార్లు అందరిలో ఒక కామన్‌ పాయింట్‌ ఉంది. అది యాక్టింగ్, డైలాగ్‌ డెలివరీ, యాక్షన్‌ కాదు... క్రమశిక్షణ గురించి చెబుతున్నాను.

 

 రామ్‌చరణ్‌ ఈ వేడుకలో మాట్లాడుతూ...మా తరం వీరి నుంచి క్రమశిక్షణను నేర్చుకుంటాం. నాతో పాటు చాలామందికి స్ఫూర్తిగా నిలిచిన సల్మాన్‌ఖాన్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు . మన తెలుగు సినిమాలానే   ‘‘దబాంగ్‌ 3’ ఉంటుంది. ఇక ప్రభుదేవా ఈ సినిమాను థియేటర్‌లో చూసి ప్రేక్షకులు  హిట్‌ చేయాలి’’ అన్నారు .  సుదీప్‌ ‘సల్మాన్‌గారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం గౌరవంగా ఫీల్‌ అవుతున్నాను’’ అన్నారు. ‘‘ఇది మా అందరికీ చాలా ప్రత్యేకమైన సినిమా’’ అన్నారు సోనాక్షీ సిన్హా.

 

రచయిత రామజోగయ్య శాస్త్రి ‘హుడ్‌ హుడ్, గుభాళించనే’ అనే పాటలు  ఈ చిత్రంలో రాసే అవకాశం ఇచ్చిన సల్మాన్, ప్రభుదేవాగార్లతో పాటు సంధానకర్తగా వ్యవహరించిన రాజేశ్వరీ సుధాకర్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు . ‘‘జీవితంలో కండలు పెంచాలనే కోరిక ఉండేది. అది తీరలేదు. కానీ కండల వీరుడికి పాట రాసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇందులో ‘ఊ కొడితే, తొలిగా తొలిగా..’ అనే పాటలు రాశాను. ప్రభుదేవా, వీవీవీ రాయుడుగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు రచయిత అనంత శ్రీరామ్‌. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రతినిధి జగదీష్, ఏషియన్‌ సునీల్‌ నారంగ్, భరత్,  శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: