2019 తెలుగు సిని పరిశ్రమకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది... భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే... ఏ అంచనాలు లేకుండా వచ్చిన గద్దల కొండ గణేష్ లాంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి... ఒకసారి ఈ ఏడాది తెలుగు సిని విశేషాలు చూస్తే...

 

+ భారీ అంచనాలతో వచ్చిన వినయ విధేయరామ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అయినా సరే దాదాపు వంద కోట్ల వసూళ్లను సాధించింది ఆ సినిమా...

 

+వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఎఫ్2 చిత్రం ఏ అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా రు.100 కోట్ల షేర్ రాబ‌ట్టి... వెంకీ, వ‌రుణ్ హిస్ట‌రీలోనే కాకుండా టాలీవుడ్‌లోనూ ఎన్నో రికార్డులు తిర‌గ‌రాసింది.

 

+మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి సినిమా 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దుమ్ము రేపింది. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

 

+నానీ నటించిన జెర్సీ సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. విభిన్న కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది.

 

+నాగ చైతన్య, సామంత కాంబినేషన్ లో వచ్చిన... మజిలి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 

+భారి అంచనాలతో వచ్చిన ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమా బోల్తా పడింది.

 

+సాహో సినిమా భారి అంచనాలతో వచ్చి ప్రేక్షకులను నిరాశ పరిచినా ప్రపంచ వ్యాప్తంగా మాత్రం 400 కోట్ల వసూళ్లు సాధించింది.

 

+భారీ అంచనాల నడుమ... విడుదల అయిన సైరా సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

 

+పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయం సాధించింది.

 

+ఇక వివాదాలు కూడా ఈ ఏడాది సినిమాను వెంటాడాయి...

 

+లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా వివాదాలకు దారి తీసాయి. గద్దల కొండ గణేష్ సినిమా టైటిల్ కూడా వివాదంగా మారింది. తొలుత టైటిల్ ని వాల్మికి గా నిర్ణయించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: