రేపు విడుదల కాబోతున్న ‘రూలర్’ మూవీ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ కమలహాసన్ రజినీకాంత్ చిరంజీవి లతో సినిమాలు తీసిన అనుభవం ఉన్న టాప్ డైరెక్టర్. సినిమాలను చాల వేగంగా తీస్తాడు అని పేరున్న కె.ఎస్. రవికుమార్ దర్శకుడుగా మాత్రమే కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక తమిళ సినిమాలలో నటించాడు. 

రేపు విడుదల కాబోతున్న ‘రూలర్’ సినిమాను ప్రమోట్ చేస్తూ కె.ఎస్. రవికుమార్ ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యలోని కొన్ని పాజిటివ్ విషయాలను వివరించాడు. 100కు పైగా సినిమాలలో నటించిన బాలకృష్ణ తన పాత్ర మేకప్ కోసం అదేవిధంగా తన డైలాగ్స్ విషయంలో పట్టుకోసం తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేచి ఎంతో నిబద్ధతతో పనిచేసిన బాలయ్యను చూస్తే తనకు ఒక సీనియర్ హీరోను చూసినట్లు అనిపించకుండా అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన ఒక యంగ్ హీరోలా అనిపించాడు అంటూ బాలయ్యల పై ప్రశంసలు కురిపించాడు.

ఇది ఇలా ఉండగా ‘రూలర్’ మూవీ షూటింగ్ సమయంలో బాలకృష్ణ ఇగోతో దర్శకుడు రవికుమార్ ఇబ్బంది పడిన సందర్భాలు కూడ ఉన్నాయి అంటూ ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక పాట చిత్రీకరణ విషయంలో బాలయ్య కల్పించుకుని కొన్ని సలహాలు ఇవ్వబోతే ఆ షూటింగ్ ను నిలిపివేసి తాను చెన్నై వెళ్ళిపోతాను అంటూ రవి కుమార్ బాలయ్యకు చెప్పి షాక్ ఇచ్చాడు అన్న గాసిప్పులు కూడ ఉన్నాయి.

అయితే సీనియర్ డైరెక్టర్ అయిన రవి కుమార్ కు సీనియర్ హీరోల ఇగోలను ఎలా కట్టడి చేయాలో తెలుసు కాబట్టి బాలయ్య ఇగోను లెక్క చేయకుండా తాను కోరుకున్న విధంగా రూలర్ సినిమాను తీసాడు అన్న వార్తలు ఉన్నాయి. ఈ సినిమాలో అనేక గెటప్స్ లో కనిపించే బాలయ్య తాను నటించిన ఒక ఐటి అధికారి పాత్ర కోసం ఏకంగా 20 కేజీల బరువు తగ్గడమే కాకుండా తన లుక్ ను మార్చుకుని ఈ సినిమా కోసం చాల కష్ట పడ్డాడు. అయితే ప్రస్తుతం యూత్ ప్రేక్షకులలో బాలయ్య సినిమాల పై క్రేజ్ లేని నేపధ్యంలో దర్శకుడు రవి కుమార్ ఈ సినిమాను ఎంత వరకు యూత్ కు కనెక్ట్ అయ్యేలా తీయగలదు అన్న విషయం పై మాత్రమే రూలర్ విజయం ఆధారపడి ఉంది..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: