నందమూరి బాలకృష్ణ.. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా రూలర్. ఈ సినిమాతో బాక్సాఫీస్ రూల్ చేసేందుకు వస్తున్న బాలయ్య బాబుకి రిలీజ్ ముందే పెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది. సినిమా బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగకపోవడమే కాకుండా.. శుక్రవారం సినిమా రిలీజ్ ఉన్నా సరే కావాల్సిన బజ్ క్రియేట్ అవలేదు. అంతేకాదు సినిమా టికెట్లు కూడా పెద్దగా బుక్ అవట్లేదని టాక్.

 

మాములుగా స్టార్ సినిమా అంటే రెండు మూడు రోజుల ముందు నుండే బుకింగ్స్ హడావిడి మొదలవుతుంది. ఫ్రైడే రిలీజ్ అయితే వీకెండ్ వరకు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వంటి సిటీస్ లో టికెట్లు ఆల్రెడీ బుక్ చేసి ఉంటాయి. ఇలా బుకింగ్ ఓపెన్ చేయడమే ఆలస్యం అలా బ్లాక్ చేసేస్తారు. అయితే రూలర్ విషయంలో మాత్రం బుకింగ్స్ పెద్దగా జరగట్లేదు అని తెలుస్తుంది. 

 

అంతేకాదు ఈ సినిమా ఓవర్సీస్ లో ఫ్రీగా రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ సినిమాకు 10 కోట్ల టేబుల్ లాస్ కాగా ఇంతకుముందు బాలయ్య బాబు నటించిన శాతకర్ణి, ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలు అక్కడ భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. అందుకే బాలకృష్ణ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ పడిపోయింది. అందుకే రూలర్ సినిమాను అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కు ఫ్రీగా ఇచ్చేశారట.

 

సినిమా కథ కూడా రొటీ రివెంజ్ స్టోరీగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా బాలయ్య విగ్గులు సరిగా సెట్ అవలేదని విమర్శలు వస్తున్నాయి. పోటీగా సాయి ధరం తేజ్ ప్రతిరోజు పండుగే సినిమా వస్తుండగా ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ జరుగనుంది. మరి 40 ఏళ్ల సిని అనుభవం ముందు 33 ఏళ్ల కుర్రాడి సినిమా ఎలాంటి ఫలితాన్ని తెచ్చుకుంటుందో చూడాలి. రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవడంతో సిని ప్రియులలో కూడా ఈ సినిమాలపై ఆసక్తి పెరిగింది. 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: