నందమూరి బాలకృష్ణ 105వ సినిమాగా వస్తున్న రూలర్ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ అవబోతుంది. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ న్యూస్ ఫ్యాన్స్ ను షాక్ అయ్యేలా చేస్తుంది. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించారు. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటించారు. అయితే టీజర్, ట్రైలర్ చూస్తే సినిమా రెగ్యులర్ బాలకృష్ణ సినిమాల్లానే ఉంటుందని అంటున్నారు.   

 

బాలయ్యలోని వీర రసాన్ని తన ప్రతి సినిమాలో చూస్తున్న నందమూరి ఫ్యాన్స్ రూలర్ లో కూడా అదే కొనసాగిస్తున్నాడని నిరాశ పడుతున్నారు. రూలర్ ట్రైలర్ లో రెండు వేరియేషన్స్ లో బాలయ్య కనిపిస్తున్నాడు. అయితే కథలో ట్విస్టులు గట్రా ఏమో కాని ట్రైలర్ మాత్రం రొటీన్ కమర్షియల్ సినిమాలానే కొడుతుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులు విఫలమవగా బాలయ్య బాబు రూలర్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

 

రిలీజ్ కు ముందే రూలర్ సినిమాపై నెగటివ్ టాక్ ప్రచారమవుతుంది. సినిమాలో కొత్తగా ఏమి ఉండదని.. ట్రైలర్ లో చూపించినట్టుగానే రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమానే అని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే అసలు టాక్ ఏంటన్నది ఒక్కరోజు వెయిట్ చేతే తెలుస్తుంది. తన సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించే బాలయ్య బాబు ఒకప్పుడు ప్రయోగాలకు పెద్ద పీఠ వేసిన ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నాడు.

 

రూలర్ తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఆ సినిమాకు ఐకాన్ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఐకాన్ టైటిల్ అల్లు అర్జున్ కోసం దిల్ రాజు రిజిస్టర్ చేయించాడు. బాలయ్య బాబు అడిగితే మాత్రం దిల్ రాజు కాదనకుండా టైటిల్ ఇచ్చే అవకాశం ఉంది. రూలర్ తర్వాత ఐకాన్ గా బాలయ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: