స్టార్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘రూలర్’ రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ గురించి గతంలో ఎన్నడూ లేని విధంగా బాలయ్య కనీ వినీ ఎరుగని రీతిలో ప్రమోషన్ వర్క్ చేస్తున్నారు.  ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు దారుణంగా ఫెయిల్‌ కావటంతో బాలయ్య అభిమానులు ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. గతంలో బాలయ్య హీరోగా జైసింహా సినిమాకు దర్శకత్వం వహించిన కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సీ కళ్యాణ్‌ నిర్మిస్తున్నాడు.  ఇందులో భాగంగా రూలర్ సినిమా గురించి, అందులో తన పాత్రల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు బాలయ్య. మూవీలోని ఫస్ట్ లుక్ గురించి, టోనీ పాత్ర గురించి బాలకృష్ణ ప్రత్యేకంగా చెప్పిన విషయం తెలిసిందే.

 

ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని అన్నారు. రూలర్ మూవీలో ఫస్ట్ లుక్ విడుదల చేసిన సమయంలో ఇండియా ట్రెండింగ్ లో నిలిచిందని బాలకృష్ణ గర్వంగా చెప్పారు. టాప్ ట్రెండింగ్ లో మూడు నిలవగా.. అందులో తన ఫస్ట్ లుక్ ఒకటి అన్నారు. తాను ఈ మూవీలో ఈ   మూడు డిఫరెంట్ రోల్స్ లో చేశానని.. ప్రతి ఒక్క రోల్ ఒక్కో ప్రత్యేకత ఉందని అన్నారు.   ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక విశాఖలో జరగడం.. మంచి స్పందన రావడం తెలిసిందే. 

 

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ  సినిమా రొటీన్‌ బాలకృష్ణ సినిమాలా కాకుండా పూర్తిగా కొత్తదనంతో సాగుతుందట. యాక్షన్‌, పంచ్‌ డైలాగ్‌లు, హీరోయిన్లతో రొమాన్స్‌ లాంటి అంశాలు అన్నీ గతంలో బాలయ్య సినిమాల్లో లేని విధంగా చూపించబోతున్నారట. మొత్తానికి ఈ మూవీ హిట్ కోసం బాలయ్య అండ కో తెగ ఆరాటపడుతున్నట్లు తెలుస్తుంది.  ఈ మూవీలో సోనాల్‌ చౌహాన్‌, వేదికలు హీరోయిన్లుగా నటిస్తుండగా జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌, శియాజీ షిండేలు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: