‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ మ్యానియాను డామినేట్ చేస్తూ ‘అల వైకుంఠపురములో’ మూవీ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతున్న నేపధ్యంలో ఈ క్రేజ్ ను ఎలా కట్టడి చేయాలో తెలియక దర్శకుడు అనీల్ రావిపూడి పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్. రాజమౌళి కొరటాల శివల తరువాత ఒక్క పరాజయం కూడ చూడకుండా వరస సక్సస్ లను అందుకుంటున్న అనీల్ రావి పూడికి ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సస్ విషమ పరీక్షగా మారింది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి మూడు పాటలు విడుదలైనా ఏ పాటకు సరైన స్పందన రాకపోవడం మహేష్ తో పాటు అనీల్ రావిపూడిని కూడ కలవర పెడుతున్నట్లు టాక్. దీనికితోడు ఈసినిమాకు సంబంధించి ఒక పాటలోని మహేష్ లుంగీ లుక్ లీక్ అయినప్పటికీ ఆ లుక్ పై క్రేజ్ ఏర్పడలేదు సరికదా విపరీతంగా సెటైర్లు కూడ పడుతున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమాను రక్షించాలి అంటే అనీల్ రావిపూడి ఎదో ఒక అద్భుతం చేయాలి అన్న ఫీలింగ్ లో మహేష్ అభిమానులతో పాటు ఈ మూవీ బయ్యర్లు ఉన్నారు. వాస్తవానికి అనీల్ రావిపూడికి ఇప్పటి వరకు టాప్ హీరోల సినిమాలను హ్యాండిల్ చేసిన అనుభవం లేదు. ‘ఎఫ్ 2’ సినిమాలో వెంకటేష్ నటించినా ఆ సినిమా రిలీజ్ కు ముందు ‘సరిలేరు నీకెవ్వరు’ పై ఉన్నట్లుగా భారీ అంచనాలు లేవు. 


దీనితో ఇప్పటికే పాటల విషయంలో పూర్తిగా వెనకపడ్డ ‘సరిలేరు నీకెవ్వరు’ ను ఏ మ్యాజిక్ చేసి అనీల్ రావిపూడి రక్షిస్తాడు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం ఆర్మీ యాక్షన్ సీన్స్ కామెడీ ట్రాక్ తో ఉండే సన్నివేశాలు తప్ప ఈ మూవీ కథలో చెప్పుకోతగ్గ ట్విస్ట్ లు లేవు అన్నప్రచారం కూడ జరుగుతోంది. దీనితో ఇన్ని ఎదిరీతలను తట్టుకుని ‘సరిలేరు నీకెవ్వరు’ నిలబడగలుగుతుందా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: