టాలీవుడ్ లో తొంభైయవ దశకం నుంచి స్టార్ హీరోలుగా వెలుగుతున్న నలుగురు హీరోల్లో విక్టరీ వెంకటేశ్ కూడా ఒకరు. తనదైన కామెడీ టైమింగ్, యాక్షన్, నటనతో తనకంటూ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్నాడు. ముఖ్యంగా మహిళాభిమానులు వెంకీకి ఎక్కువని చెప్పాలి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ.. ఇలా ఏ జోనర్ చూసినా వెంకీకి స్పెషల్ ప్లేస్ ఉంది. తనదైన మార్క్ ను ఏర్పరచుకుని టాలీవుడ్ లో ముప్పై ఏళ్లుగా తన హవా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం కూడా వెంకీ హవా కొనసాగుతోందని చెప్పాలి.

 

 

2019 మొత్తం హీరోల ఏవరేజ్ తీసుకుంటే వెంకటేశ్ టాప్ పొజిషన్ అనే చెప్పాలి. చిరంజీవి నుంచి అందరి హీరోలు సినిమాలు చేసినా వెంకటేశ్ రెండు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి ఈ ఏడాది తనదేనని నిరూపించాడు. ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి వచ్చిన ఎఫ్2 బ్లాక్ బస్టర్ హిట్ సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఏడాది చివర వెంకీ మామతో మరో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఈ ఉదాహరణ ఒక్కటి చాలు వెంకటేశ్ సాధించిన విజయానికి. వయసు పెరుగుతున్నా తనలోని కామెడీ టైమింగ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు వెంకీ. నువ్వు నాకు నచ్చావ్ తరహా కామెడీ టైమింగ్ తోనే ఈ రెండు సినిమాలను బ్లాక్ బస్టర్స్ చేశాడని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆడియన్స్ కూడా చెప్తున్న మాట.

 

 

వయసు పెరిగినా తనలోని కామెడీ టైమింగ్ ఏమాత్రం తగ్గలేదని కూడా వెంకీ నిరూపించాడు. కామెడీలో వెంకీ ఎంతటి దిట్టో, సెంటిమెంట్ పండించడంలో కూడా అంతే దిట్ట. వెంకీ మామలో రెండింటినీ మిక్స్ చేసి హిట్ ఇచ్చాడు. ఈ రెండు సూపర్ హిట్స్ లో వెంకీ పాత్రలే కీలకంగా మారాయి. మొత్తానికి వెంకీ తన సీనియారిటీ పవర్ ఏంటో చూపించాడనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: