అతి కొద్ది రోజుల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఈ గుర్తింపు ఎంతలా అంటే దక్షిణాది నుండి గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన పేర్లలో మొదటి వాడిగా తెచ్చుకునేంతగా..అంతే కాదు మనోడికి బాలీవుడ్ లోనూ బాగా క్రేజ్ ఉంది.మొన్నటికి మొన్న బాలీవుడ్ భామ ఆలియా భట్ మోస్ట్ స్టైలిష్ యాక్టర్ విజయ్ దేవరకొండ అంటూ కితాబివ్వడంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో మనోడికి క్రేజ్ ఎంతలా ఉందో తెలిసొచ్చింది.

 

 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా చేస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నలుగురు కథానాయికలు నటిస్తున్నారు. ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్ల, రాశీ ఖన్నా, కేథరిన్ ట్రెసా లు నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల రోజున విడుదలకి సిద్ధం అవుతోంది. అయితే ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ స్ట్రీట్ డాన్సర్స్ 3 సినిమాని ఉద్దేశిస్తూ ‘నేను నా జీవితంలో ఇలాంటి సినిమా చేయలేను…చూసి ఎంజాయ్ చేయడమే తప్ప’ అన్నారు. 

 

 

వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ జంటగా దర్శకుడు రెమో డిసౌజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డాన్స్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరున్న ప్రభుదేవా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం జనవరి 24 వ తేదీన విడుదల అవుతుంది. అత్యున్నతనమైన డాన్స్ ప్రమాణాలతో నరాలు తెగే డాన్స్ మూవ్మెంట్స్ తో ఈ చిత్రం తెరకెక్కింది. 

 

ఇలాంటి డాన్స్ ప్రధానమైనా చిత్రాలు తన వల్ల కాదని, జీవితంలో ఎప్పుడూ ఇలాంటి సినిమాలు చేయబోనని స్పష్టం చేశాడు. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ లో చేసిన డాన్స్ గురించి అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: