నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తున్న రూలర్ సినిమా ఈనెల 20 వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా సెన్సార్ కార్యక్రమం నిన్నటి రోజున పూర్తయింది.  యూ/ఏ సర్టిఫికెట్ పొందింది.  సినిమాపై అంచనాలు ఉన్నాయి.  ఇందులో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తున్నారు.  అందులో ఒకటి బిజినెస్ మెన్ కాగా, రెండో పాత్ర పోలీస్ ఆఫీసర్ పాత్ర.  రెండు పాత్రల్లో బాలయ్య అరిపించినట్టు టాక్ వస్తోంది.  


అయితే, సెన్సార్ టాక్ ప్రకారం సినిమా కథ పెద్దగా ఏమి లేదని పాత కథలాగే ఉందని, బాలయ్య యాక్టింగ్ తో సినిమాను నడిపించారని అంటున్నారు.  ఇక సినిమా రెండున్నర గంటల రన్ టైమ్ ను సెట్ చేశారు.  రెండున్నర గంటలు అంటే కొద్దిగా ఎక్కువ. సినిమా బాగుంటే ఈ సమయం పెద్ద ఎక్కువేమీ కాదు.  కానీ, ఎటొచ్చి సినిమాకు తేడా వస్తేనే... ఇబ్బంది.  తేడా వస్తే రెండున్నర గంటలసేపు థియేటర్లో కూర్చోవాలంటే ప్రేక్షకులు ఇబ్బందిగా ఫీలవ్వాల్సి వస్తుంది. 


బహుశా ఈ ఉద్దేశ్యంతోనే ఈ సినిమా రన్ సమయాన్ని రెండున్నర గంటలకు కట్టడి చేసి ఉండొచ్చని అంటున్నారు.  ఎందుకంటే సినిమా రన్ సమయం పెంచితే ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశం ఉంటుంది.  ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి సినిమాను వీలైనంత తక్కువ సమయం ఉండేలా చూసుకుంటున్నారు.  ఇలా తక్కువ సమయం ఉండేలా చూసుకుంటే.. సినిమా ఫాస్ట్ గా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది.  


ఇది సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది.  ఎక్కడైనా కొద్దిగా బోర్ కొట్టినట్టు అనిపించినా పెద్దగా ఇబ్బంది ఉండదు.  వెంటనే సీన్ చేంజ్ అవుతుంది కాబట్టి సినిమాకు ఇబ్బంది ఉండకపోవచ్చు అని అంటున్నారు.  మరి ఈ సినిమా విషయంలో వచ్చే టాక్ ను బట్టే సినిమా కలెక్షన్లు ఉంటాయి.  సినిమా సేవ్ కావాలంటే కనీసం సినిమా రూ. 30 కోట్ల రూపాయల వరకు షేర్ వసూళ్లు చేయాల్సి ఉన్నది.  మరి సినిమా ఎలా ఉంటుంది అనే విషయం రేపు ఈ సమయం వరకు తేలిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: