డిసెంబర్ 20న మెగా అభిమానులకు పండగే ఎందుకంటే మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ప్రతి రోజు పండగే సినిమా విడుదల కాబోతుంది. చిత్రలహరి సినిమాతో మంచి దూకుడు మీద ఉన్న సాయి ధరంతేజ్ మారుతి దర్శకత్వంలో ప్రతి రోజు పండగే సినిమాలో నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వినోదభరితంగా సాగే ఈ సినిమాలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సరసన అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా నటిస్తోంది. కాగా ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో విలక్షణ నటుడు సత్యరాజ్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాపై అందరూ భారీ ఆశలే పెట్టుకున్నారు. 

 

 

 గతంలో వరుస డిజాస్టర్ లతో ఉన్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి విజయంతో మంచి బూస్టును అందుకోగా ప్రతి రోజు పండగే సినిమాతో కూడా విజయాన్ని అందుకొని తన కెరీర్ని గాడిలో పెట్టుకోవాలని భావిస్తున్నాడు.. ఇక దర్శకుడు మారుతి కూడా ఈ సినిమా విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక రాశి కన్నా కూడా వెంకీ మామ సినిమాతో ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకోగా..  ప్రతి రోజు పండగే సినిమా విజయం తో కూడా ఈ సంవత్సరం రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుని మరిన్ని అవకాశాలను చేజిక్కించుకోవాలని ఆశిస్తోంది. 

 

 

 

 అటు నిర్మాత అల్లు అరవింద్ కూడా... ఈ సినిమా మంచి విజయం సాధించి తనకు కాసుల వర్షం కురిపిస్తుందని సాయి ధరంతేజ్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. తనకి కాసుల వర్షం కురిపించడంతో పాటు మెగా హీరో మంచి విజయం సాధించాలని ఆశపడుతున్నాడు అల్లు అరవింద్. అయితే డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేరోజు నందమూరి బాలకృష్ణ రూలర్ సినిమా కూడా విడుదల కాబోతుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర మంచి పోటీ ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న సినిమాలకు ఈ మధ్య ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ పండగే సినిమా కూడా మంచి ఆదరణ లభించింది అని చిత్రబృందం భావిస్తోంది. కాగా ఈ సినిమా ప్రేక్షకులను  ఎంతవరకు సాటిస్ఫై చేస్తుంది అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: