సల్మాన్ ఖాన్ తో రామ్ చరణ్ కు ఉన్న సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అతడికోసం ప్రత్యేకమైన వంటలు చేయించి చరణ్ తన ఇంటి వద్ద నుండి పంపుతాడు. ఇలాంటి సాన్నిహిత్యం వీరిద్దరి మధ్య ఉండటంతో సల్మాన్ ఖాన్ చరణ్ ను తన తమ్ముడుగా పిలిచి అందరికీ షాక్ ఇచ్చాడు. 

ఈ సంఘటన నిన్న జరిగిన ‘దబంగ్ 3’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగింది. ఈ ఫంక్షన్ కు వెంకటేష్ తో కలిసి చరణ్ అతిధులుగా రావడంతో సల్మాన్ ఖాన్ చరణ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. చిరంజీవి చరణ్ లు తనకు బాగా దగ్గర అయిన వ్యక్తులు అని చెపుతూ చరణ్ ను తన్న తమ్ముడిగా అభివర్ణించడంతో ఈ ఫంక్షన్ జరుగుతుఉన జేఆర్సీ సెంటర్ ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది.

అంతేకాదు సల్మాన్ వ్యాఖ్యలకు లవ్ యూ అంటూ అభిమానులంతా ప్లైయింగ్ కిస్సులతో తమ ప్రేమను చాటుకున్నారు. ఈమధ్య కాలంలో ఎప్పుడులేని విధంగా ఒక హిందీ సినిమాకు ఇక్కడి పెద్ద చిత్రాల తరహాలో ప్రి రిలీజ్ ఈవెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  వాస్తవానికి ముంబాయిలో సైతం ఇలాంటి ఈవెంట్ చేయడం అలవాటు లేని సల్మాన్ ఈ వేడుకలో పాల్గొనడమే కాకుండా  స్టేజ్ మీద చరణ్ వెంకటేష్ లతో కలిపి  స్టెప్పులు వేయడం ఈ ఈవెంట్ కు హైలెట్ గా మారింది.   

రామ్ చరణ్ వెంకటేష్ లతో కలిపి చేతులు తిప్పుతూ వేసిన  సిగ్నేచర్ స్టెప్ తో ఈ ఫంక్షన్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి సల్మాన్ జోష్ ను నింపాడు.  దీనికితోడు తెలుగు సాంప్రదాయ పద్ధతిలో అందరికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ హడావిడి చేసిన సల్మాన్ ను చూసిన వారికి తెలుగు మార్కేట్ పై సల్మాన్ చాలా ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈమధ్య కాలంలో సల్మాన్ సినిమాలకు భారీ విజయాలు దక్కకపోతున్న పరిస్థితులలో రాబోతున్న క్రిస్మస్ సల్మాన్ కు ఎలాంటి అదృష్టాన్ని కలిగిస్తుందో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: