మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్.  మెగాస్టార్ చిరంజీవికి స్వయానా మేనళ్లుడు.. అచ్చం మామ పోలికలు ఉంటాయని ఫిలిమ్ వర్గాల్లో టాక్.  సాయిధరమ్ తేజ్ ఎంట్రీ అంత ఈజీగా కాలేదు.. మొదట వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రేయ్ మూవీతో రావాలనుకున్నాడు.. కానీ అది మద్యలోనే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయింది. ఇదే సమయంలో సాయిధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ మూవీ రిలీజ్ అయ్యింది.  మొదటి సినిమాతోనే మెగా హీరో ఇలా ఉండాలని చూపించాడు సాయిధరమ్ తేజ్.  ఫైట్స్, డ్యాన్స్, కామెడీ అన్నింటా తన సత్తా చాటాడు.  ఆ తర్వాత రేయ్ మూవీ రిలీజ్ అయినా దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 

 

ఆ వేంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో సుబ్రమణ్యం ఫర్ సేల్ మూవీతో మరో ఘనవిజయం అందుకున్నాడు.  ఆ తర్వాత సుప్రీమ్ తో బాక్సాఫీస్ షేక్ చేశాడు.  ఆ తర్వాత ఈ మెగా హీరోకి బ్యాడ్ టైమ్ మొదలైంది.. వరుసగా ఆరు సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా మిగిలాయి. మెగా హీరోలంటే మాస్ ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతారని అంటారు.  అయితే ఇప్పుడు సాయిధరమ్ తేజ్ మాస్ మాత్రమే కాదు క్లాస్ పీపుల్స్ ని కూడా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన చిత్రలహరి మూవీతో ఆ టచ్ చేశాడు..తాజాగా ‘ప్రతిరోజూ పండగే ’ మూవీతో క్లాస్, ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతున్నాడు. 

 

మారుతి తెరకెక్కిస్తున్న ‘ప్రతిరోజూ పండగే ’ మూవీలో సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా నటిస్తున్నారు. మారే కాలంతో పాటు మనమూ మారాలి.. వయసుతో పాటు ఆశలు కూడా చచ్చిపోవాలని తాత సత్యరాజ్ ఆలోచనలు ఎలా మారాయి వంటి విషయాలు చుట్టూ కథ తిరుగుతుంది.  ట్రైలర్ చూస్తుంటే.. గ్రామీణ వాతావరణంలో అహ్లాదంగా సాగే కుటుంబ కథా చిత్రంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ మూవీతో సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ, క్లాస్ ఆడియన్స్ ని తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో సక్సెస్ సాధిస్తాడా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: