తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ ఏడాది సెకండాఫ్ ఆశించిన స్థాయిలో ఇండస్ట్రీ నుండి సినిమాలు రాకపోవడం ఒక్క మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మినహా మరొక సినిమా రాకపోవటంతో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెల లో నీరసించి పోయారు. దసరా పండుగ అంటే మామూలుగా గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినిమాలు వచ్చాయి. చాలా మంది డైరెక్టర్లు దసరా పండుగ టార్గెట్ చేసుకుని సినిమాలు నిర్మించే వాళ్లు అప్పట్లో. ఇదే తరుణంలో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు కూడా అదేవిధంగా తమ సినిమాలు దసరా పండుగకు విడుదల అయ్యి భారీ హిట్ కొట్టి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేయాలని సినిమాలు ప్లాన్ చేసే వాళ్ళు.

 

ఇటువంటి తరుణంలో ఈ ఏడాది ఒక్క సినిమా కూడా దసరా పండుగ కి మరియు అదే విధంగా ఈ సంవత్సరం సెకండాఫ్ లో ఏ స్టార్ హీరో సినిమాలు రాకపోవడంతో టాలీవుడ్ సినిమా ప్రేమికులు ఫుల్లుగా నీరసించి పోవడం జరిగింది. అయితే ఈ నెల డిసెంబర్ నెల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు నటించిన సినిమాలు వరుసగా విడుదల అవటానికి రెడీ అయిన తరుణంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఉన్న సినిమా థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది.

 

తెలుగు సినిమా ప్రేక్షకుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు బడా హీరోలు మంచి సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజూ పండగే, బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రూలర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితో పాటు డబ్బింగ్ చిత్రాలు కార్తీ , జ్యోతికల దొంగ, సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 చిత్రం తెలుగు ప్రేక్షకులని పలకరించనున్నాయి. ఈ సినిమాలన్నింటిపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొని ఉండగా, ఏ సినిమా ప్రేక్షకులని ఎక్కువగా అలరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: